నవ్వులపాలైన విజయసాయిరెడ్డి..?

రాజకీయాల్లో పెద్ద నేతలు మాట్లాడే ప్రతి మాటకు ఓ విలువ ఉంటుంది. అందుకే ఎదుటివారిపై ఏదైనా ఆరోపణ లేదా విమర్శ చేసేటప్పుడు వారు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అలా కాకుండా నోరు జారితే మాత్రం అభాసుపాలు కావడం ఖాయం. ఇప్పుడు అనంతపురం జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేతకి ఈ పరిస్థితే ఏర్పడింది. ఇంతకీ ఆయన ఏ విషయంలో నోరు జారారో ఈ కథనంలో తెలుసుకోండి.
రాజకీయాల్లో పెద్ద నాయకులుగా మాట్లాడే ప్రతి మాటకీ ఓ విలువ ఉంటుంది. వ్యక్తులు లేదా ప్రత్యర్థి పార్టీలపై వారు వ్యాఖ్యలు చేసేటప్పడు ఎంతో జాగ్రత్త వహించాలి. అప్పుడే వారి స్థాయికి తగ్గ గౌరవం లభిస్తుంటుంది. ఒకవేళ గాలి పోగేసి మాట్లాడారే అనుకోండి- వారి విలువ దిగజారిపోతుంది. వైసీపీలో రాష్ట్రస్థాయి నాయకుడుగా వర్థిల్లుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల ఇలాంటి నగుబాటే కొనితెచ్చుకున్నారట. ఆ సంగతిని అనంతపురం జిల్లా టీడీపీ వర్గాలతోపాటు పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు.
అసలు విషయానికి వస్తే.. ధర్మవరం పట్టణానికి చెందిన నాగూర్ హుస్సేన్ గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన హుస్సేన్ జిల్లాలోకి ఆయుధాలతో ప్రవేశించాడనీ, అతనిపై కేసులు పెట్టకపోగా, అధికారపార్టీ నేతల సూచన మేరకు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అతన్ని జిల్లా సరిహద్దు దాటించారనీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ ఆరోపణపై వెంటనే జిల్లా ఎస్పీ స్పందించారు. విజయసాయిరెడ్డి పేర్కొన్న తేదీల్లో అసలు తాను దేశంలోనే లేననీ, విదేశాలకు వెళ్లానని స్పష్టంచేశారు. దీంతో వైకాపా నేతలు కూడా నాలుక కరుచుకోవాల్సి వచ్చింది. జిల్లా పార్టీ నేతలు చెప్పే మాటలను ఆసరా చేసుకుని విజయసాయి మాట్లాడారనీ, అందులో వాస్తవం ఎంత ఉందో తెలుసుకోలేదనీ కొందరు గట్టిగా చురకలు అంటించారు కూడా!
ఇటీవల మరో సందర్భంలోనూ ఇలాగే జరిగింది. పరిటాల శ్రీరామ్‌పై కూడా వైసీపీ నేతలు నోరు జారారు. అధికారబలంతో జిల్లాలో పరిటాల శ్రీరామ్‌ అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్టీ నేతలు చేసిన ఈ ఆరోపణలకు వైసీపీ అధిష్టానం కూడా వత్తాసు పలికింది. అయితే సరైన పరిశీలన చేసుకోకుండా ఒక పార్టీ ఇలాంటి వైఖరి తీసుకోవడంపై జిల్లాలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలను తనకు ఆపాదించడంపై శ్రీరామ్‌ స్వయంగా మీడియా సమావేశంలో

ఖండించారు. తనను రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆయన చేసిన ప్రకటన సంచనలం సృష్టించింది. ఇవండీ జిల్లాలో వైసీపీ పెద్దల తాజా ఘనకార్యాలు!

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *