కూలిపోతున్న వై కా పా కంచుకోటలు

కడప జిల్లా వై ఎస్ కుటుంబానికి పెట్టనికోట లాగా వున్న జిల్లా , రాజశేఖర్ రెడ్డి 1978లో రాజకీయాలలోనికి వచ్చిన 1989 వచ్చేసరికి కడప జిల్లాలో తన పట్టు ఉండేలాగా చూసుకున్నారు 1989 లో జిల్లా లో జమ్మలమడుగు , కోడూరు తప్ప మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ గెలిచింది ,
1994 లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ 24 సీట్లు గెలిస్తే అందులో 4 కడప నుంచే గెలిచారు , పులివెందుల , మైదుకూరు , ప్రొద్దుటూరు , రాయచోటి లో అప్పట్లో కాంగ్రెస్ గెలిచింది
1999 లో కాంగ్రెస్ కేవలం 3 చోట్ల గెలిచింది 1 పులివెందుల , 2 ప్రొద్దుటూరు , 3 కమలాపురం , మొట్టమొదటిసారి ఈ ఎన్నికలలో వైఎస్ కుటుంబ హావాకి ఇక్కడ చెక్ పెట్టగలిగారు
2004 తెలుగుదేశం ఇక్కడ ఒక్క సీట్ గెలవలేకపోయింది , అప్పుడు మొదలైన పతనం 2014 వరకు వరసగా 3 ఎన్నికలలో కొనసాగింది , 2009 లో ప్రొద్దుటూరు ఒక సీట్ గెలుచుకున్న తెలుగుదేశం , 2014 లో రాజంపేట ఒక్క స్తానం తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ,
ప్రస్తుత పరిస్థితి
చంద్రబాబు ముఖ్య మంత్రి అయినా కొత్తలో ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్దగా పట్టు చిక్కలేదు , ప్రజలు వైఎస్ కుటుంబం పట్ల విధేయత తో ఉండేవారు , అయితే కాల క్రమంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలు , ప్రజలకి అందుతుండటంతో ప్రజలలో మార్పు వచ్చింది , ముఖ్యంగా గత రెండు సీజన్లుగా కృష్ణ నీళ్లు రాయలసీమకి అందుతుండటంతో ఇక్కడ రైతాంగంలో చంద్రబాబు పట్ల సానుకూల వాతావరణం ఏర్పడింది
జగన్ వైఖరి నచ్చక , అది నారాయణ రెడ్డి తెలుగుదేశంలో జాయిన్ అవ్వటం వై కా పా కి ఈ జిల్లా లో పెద్ద దెబ్బ , అది నారాయణ రెడ్డి ని జగన్ & కో చాల తక్కువగా అంచనా వేసింది , రామసుబ్బారెడ్డికి ఎంఎల్ సి ఇవ్వటం , అది నారాయణ రెడ్డి రామ సుబ్బా రెడ్డి మధ్య విభేదాలు సమసి పార్టీకి పని చేస్తుండటం వాళ్ళ పార్టీ కి బాగా కలిసి వస్తోంది , జమ్మలమడుగు లో వై కా పా పరిస్థితి ఏమిటంటే మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాలలో ఏజెంట్లు పెట్టుకునే పరిస్థితి వై కా పా కి లేదు ,
జమ్మలమడుగు పూర్తిగా ఫ్యాక్షన్ నియోజకవర్గం గతంలో ఇక్కడ తెలుగుదేశానికీ బలమైన గ్రామాలలో వై కా పా కి ఏజెంట్లు ఉండేవారు కాదు , అలాగా అది నారాయణ రెడ్డి ప్రభావం వున్న చోట తెలుగుదేశంకి ఏజెంట్లు ఉండేవారు కాదు , అది నారాయణ రెడ్డి తెలుగుదేశంలో చేరటం వల్ల ఇక్కడ వై కా పా కి ఏజెంట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది , రాష్ట్రము లో 2019 లో తెలుగుదేశం గెలిచే మొదటి సీట్ జమ్మలమడుగు , ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేవలం మెజారిటీ లెక్క చేసుకోటానికి మాత్రమే కౌంటింగ్ హాల్ కి వెళ్ళాలి ,
రాజంపేట , ఇక్కడ సిటింగ్ ఎమ్యెల్యే మీద మల్లిఖార్జున రెడ్డి ప్రజలతో నిరంతరం మమేకం అవుతున్నారు , ప్రజల లో మంచి పేరు వుంది , జమ్మలమడుగు తరవాత తెలుగు దేశం గెలిచే రెండో స్తానం రాజంపేట ,
కోడూరు , 2014 లో ఇక్కడ గెలుపు అంచుకు వచ్చి తెలుగు దేశం పార్టీ బొక్క బోర్లా పడింది ,ఈ సారి ఆ పరిస్థితి లేదు , తెలుగు దేశం 100 శాతం గెలిచే 3 నియోజక వర్గాలలో కోడూరు నిలుస్తుంది అనుటలో అతియోశక్తి లేదు ,
బద్వేల్ 2004 వరకు ఇది తెలుగుదేశం కంచుకోట తదనంతరం పరిమాణాలు లో తెలుగు దేశం ఇక్కడ 3 సార్లు ఓడిపోయింది , కానీ ప్రస్తుతం ఇక్కడ పార్టీ పుంజుకుంది
రాయచోటి , కడప , ఈ రెండు చోట్ల ముస్లిం , మైనారిటీలు ప్రభావం ఎక్కువ , వై కా పా , భాజపా మ్యాచ్ ఫిక్సింగ్ ఈ రెండు చోట్ల వై కా పా ఆశలు దెబ్బ తీస్తున్నది , అదే సమయం లో తెలుగు దేశం ప్రభుత్వం మైనారిటీలు కోసం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యకర్మలు మైనార్టీలకు తెలుగు దేశం పార్టీని దగ్గర చేస్తున్నాయి
ప్రొద్దుటూరు వాస్తవానికి ఇక్కడ 2009 లో తెలుగుదేశం గెలిచింది , తరవాత కాంగ్రెస్ నుంచి వరసగా 5 సార్లు గెలిచినా వరద రాజులు రెడ్డి 2014లో తెలుగు దేశంలో చేరారు , కానీ వరద రాజులు రెడ్డి వృద్దాప్యం , ఇక్కడ తెలుగు దేశానికీ మైనస్ గా మారుతున్నది ,
కమల పురం , మైదుకూరు స్థానాలు లో తెలుగుదేశం వై కా పా మధ్య నువ్వా నేనా అనే స్థాయి లో పోటీ వుంది ,
పులివెందుల వై కా పా కి అనుకూలం గా ఉన్నప్పటికీ , గతంలో వచ్చినంత మెజారిటీ ఈ సారి ఇక్కడ రాకపోవచ్చు ,
జిల్లా లో మొత్తం 10 స్థానాలు లో 6 చోట్ల తెలుగు దేశం కి అనుకూలం గా వున్నాయి 2 చోట్ల గట్టి పోటీ , మరో 2 చోట్ల వై కా పా కి అనుకూలం గా వున్నాయి ,
2014 లో జిల్లా లో 9 చోట్ల గెలిచినా వై కా పా 2019 లో రెండు చోట్ల మాత్రమే గెలిచే పరిస్థితి కి వచ్చింది అంటే ఆ పార్టీ యెంత దయనీయ స్థితి లో

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *