
చిన్న చిన్న తప్పులు ఈరోజు అధికారానికి దూరం కావలసి వచ్చింది వైఎస్ జగన్ కీ 2014 ఎన్నికల్లో చేసిన . గత ఎన్నికలలో చేసిన తప్పులను ఈసారి సరిదిద్దుకొని సీట్ల ఎంపికలో పార్టీ అధినాయకత్వం సరైన వ్యూహరచన చేసి టిడిపిని దెబ్బ తీయడానికి పక్కా ప్రణాళిక వేస్తుంది. నాలుగేళ్లుగా తగిలిన దెబ్బలకు వైఎస్ జగన్ మెళకువలు నేర్చుకొని పరిణితి చెందిన నేతగా అడుగులు వేస్తున్నారు. రాజధాని చుట్టు పక్కల ప్రాంతాలలో ఉన్న కమ్మ సామజిక వర్గానికి చెందిన తెలుగుదేశం అసంతృప్త నేతలపై వైసిపి నాయకత్వం కన్నేసింది.
ఈ ఆపరేషన్ అంత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులైన రాజధాని చుట్టు పక్కల ప్రాంతాల నేతలకు అప్పగించారు. వారు ఎప్పటికప్పుడు చక్కపెడుతూ సరైన లీడర్లను వైసిపిలోకి తీసుకువచ్చే పనిలో నిమగ్నమయ్యారు. తెలుగుదేశం పార్టీ 23 మంది ఎమ్మెల్యేలను లాక్కుని వైసిపి నాయకుడు వైఎస్ జగన్ కు గట్టి దెబ్బ వేశానని సంబరపడుతున్న వేళ, వైఎస్ జగన్ కమ్మ సామజిక వర్గంలో ఉన్న అత్యంత బలమైన నేతలను పార్టీలో చేర్చుకొని టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ కు గట్టి కౌంటర్ ఇచ్చే పనిలో ఉన్నారు.
దీనిలో భాగంగానే విజయవాడ పడమరకు చెందిన ఎంవిఆర్ చౌదరి వైసిపి పార్టీలో చేరడం తెలుగుదేశంలో ఉన్న కమ్మ సామజిక వర్గ నేతలకు మింగుడుపడటం లేదు. ఎంవిఆర్ చౌదరికి జిల్లాలో భారీగా బంధుత్వం ఉంది, యూత్ లో ఎంవిఆర్ చౌదరి ఫాలోయింగ్ అంత ఇంతా కాదు. గతంలో ఎంవిఆర్ చౌదరి నెహ్రు అనుచరుడిగా ఉండేవాడు, ఇప్పుడు వైసిపి చెంతకు చేరి ఆ ప్రాంతంలో వైసిపి జెండా రెప రెపలాడించడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు.
అలానే విజయవాడకు చెందిన గన్నవరం కమ్మ నాయకుడు యార్లగడ్డ వెంకటరావు కూడా ఫ్యాన్ పంచన చేరారు, యార్లగడ్డ అంగ, అర్ధ బలం దండిగా ఉన్న నేత, వచ్చే ఎన్నికలలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశి మీద పోటీకి సై అనడానికి సిద్ధంగా ఉన్నారు.
విజయవాడ, గుంటూరులో ఉన్న 30 కి పైగా నియోజకవర్గాలలో కమ్మ సామజిక వర్గం ఎక్కువగా ఉంది. దీంతో విజయవాడలోని గన్నవరం, పెనమలూరు, విజయవాడ తూర్పు వంటి నియోజకవర్గాలలో కమ్మ వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చి విజయవాడ, గుంటూరులో జిల్లాలో ఉన్న కమ్మ కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని వైఎస్ జగన్ యోచిస్తున్నారు.
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఒకరు వైసిపి తీర్ధం పుచ్చుకోవడం ఖాయంగా కనపడుతుంది, తెలుగుదేశం అధినేత చంద్రబాబు దెబ్బకి వేగలేక వైసిపిలోకి రావడానికి ఆసక్తి కనపరుస్తునట్లు తెలుస్తుంది. ఆ నేతకు విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాలలో బంధుగణంతో పాటు పెద్ద నెట్వర్క్ ఉంది. ఈ సారి కమ్మ కులస్థులు ఎక్కువగా ఉండే పెనమలూరు స్థానం ఎట్టి పరిస్థితులలో వైసిపి ఖాతాలో వెయ్యాలని పక్కా వ్యూహరచన చేస్తున్నారు.
విజయవాడలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే బంధువుతో వైసిపి వర్గాలు మంతనాలు చేస్తున్నాయి, అయన గతంలో విజయవాడ మేయర్ పదవిపై ఆశ పెంచుకొని దక్కకపోవడంతో అలకబూనాడు. వైసిపిలో చేరి తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడానికి తన సత్త చూపిస్తానని ప్రతిజ్ఞలు చేస్తున్నాడు. అలాగే విజయవాడ ఎంపీ స్థానం కూడా బడా కమ్మ నేతకు ఇవ్వడానికి వైఎస్ జగన్ ఇప్పటికే బారి ప్రణాళిక రచించినట్లు తెలుస్తుంది.
ఇదే విధముగా కాపు కులస్థులెక్కువగా ఉన్న చోట ఇదే విధానాన్ని అవలంబించి తెలుగుదేశం పార్టీని పక్కా ప్రణాళికతో దెబ్బ తియ్యడానికి వైఎస్ జగన్ ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో బారి ప్రణాళిక రచించినట్లు తెలుస్తుంది. రాజధాని చుట్టు పక్కల ఉన్న నియోజకవర్గాలలో 13 సీట్ల వరకు కమ్మ వారికి ఇవ్వడానికి ఇప్పటికే వైఎస్ జగన్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.