జగన్ రాజీనామా

ఏపీ రాజకీయాల్లో సంచలనాత్మక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో ఎవరికి వారు పోరాటం చేస్తున్నారు. అయితే టీడీపీ భాజాపాతో మిత్రపక్షంగా ఉన్నా ఏకంగా కేంద్రమంత్రులతోనే రాజీనామా చేయించింది. అటు ఎంపీలను సైతం రాజీనామాకు అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఆయన ప్రస్తుతం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అయితే ఊహించని విధంగా జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు లోటస్ పాండ్ నుంచి అందిన తాజా వార్త. ఓ వైపు తన పాదయాత్రను కంటిన్యూ చేస్తూనే ఇటు రాష్ట్ర రాజకీయాల్లో బాగానే పాల్గొంటున్నారు జగన్. మరీ ముఖ్యంగా మోడీ గవర్నమెంటుపై అవిశ్వాసతీర్మానం పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పుడు ఆయన పదవి రాజీనామా సంచలనంగా మారింది. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకరాష్ట్రం కోసం తన పదవులకు పలుమార్లు రాజీనామా చేసి మరీ గెలిచారు. అయితే తాజాగా జగన్ కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని తెలుస్తుంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *