రేపు శుక్రవారం కావడంతో

వైసీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర నిన్నటితో 200 రోజులు పూర్తి చేసుకుంది . ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర రద్దయ్యింది . ఈ రోజు షెడ్యూల్ ప్రకారం భీమనపల్లి నుండి ప్రారంభం కావలసి ఉండగా వర్షం కారణంగా రోడ్లన్నీ నడవడానికి వీలు లేనట్టుగా తయారయ్యాయి . ఈ పరిణామంతో జగన్ తన పాదయాత్ర రద్దు చేసుకొని హైదరాబాద్ బయలుదేరారు . రేపు శుక్రవారం కావడంతో జగన్ సీబీఐ కోర్టులో విచారణకు హాజరయ్యి రేపు సాయంత్రానికి తిరిగి తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంటారు .

ఈ భామ లేటుగా లేచిన‌ట్లుందిగా..!

కాస్టింగ్ కౌచ్ గురించి టాలీవుడ్‌లో గ‌త కొంత‌కాలంగా తీవ్ర ఉద్య‌మం నడుస్తున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్‌లో అవ‌కాశం కోసం పడుకోవ‌లని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది న‌టి శ్రీరెడ్డి. త‌రువాత ఈ ఉద్య‌మం తీవ్ర స్థాయిలో న‌డిచింది. అయితే తాజాగా కాస్టింగ్ కౌచ్‌కు నేను గురైయ్యానంటుంది హీరోయిన్ నీతూ చంద్ర. హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసిన ఈ అమ్మ‌డు కెరీర్ స్టార్టింగ్‌లో తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాదితురాలినే అంటుంది.
Related image
ఓ టాప్ ఫిలిం మేకింగ్ కంపనీ నుండి ఫోన్ వచ్చింది. ఎన్నో ఆశలతో ఆఫీస్ కు వెళ్లగా.. ఆ నిర్మాత నన్ను కమిట్మెంట్ అడిగాడు. అప్పటికి నా వయసు 23 సంవత్సరాలు. అతడు ఏం అడుగుతున్నాడో అర్ధం చేసుకోలేకపోయాను. అదే విషయాన్ని ఆయనకు చెప్పగా చాలా క్లియర్ గా తనకు ఏం కావాలో చెప్పుకొచ్చాడు. నేను అంగీకరించకపోవడంతో టాప్ బ్యానర్ లో నటించే ఛాన్స్ పోయింది. దీని కార‌ణంగానే త‌న‌కు స‌రైన అవ‌కాశాలు రాలేద‌ని చెప్పుకొచ్చింది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *