జగనన్న అందుకే నిన్ను పొడిచేసా….

విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడి జరిగింది. హైదరాబాద్‌ వచ్చేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన జగన్‌పై శ్రీనివాసరావు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్ వద్దకు వచ్చిన శ్రీనివాస్.. కోడిపందేల్లో ఉపయోగించే కత్తితో దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే సహాయకులు అడ్డుకోవడంతో జగన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తి ఎయిర్‌పోర్ట్‌లోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం జగన్ హైదరాబాద్‌ బయలుదేరారు.

అంతకముందు ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో వెయిట్ చేస్తున్న జగన్‌కు టీ ఇచ్చిన శ్రీనివాస్.. నేను మీ అభిమానిని, ఈ సారి ఎలక్షన్స్ లో మనకు 160 సీట్లు వస్తాయా’’ అంటూ పలకరించాడు. అనంతరం సెల్ఫీ దిగుతానంటూ దాడికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడి సిబ్బంది శ్రీనివాస్ ని అదుపులో తీసుకున్నాడు.

దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఆ నిందుతుడు చెప్పిన మాటలకి అవాక్కయ్యారు. ఇది తెలుసుకున్న జగన్ కూడా బిత్తరపోయాడు. ఆ యువకుడు జగన్ కి వీరాభిమాని, జగన్ ఎలాగైనా వచ్చే ఎలక్షన్స్ లో గెలవాలని ఇలా చేసానని, ఆయనను పొడిస్తే పబ్లిసిటీ అయ్యు సింపతితో గెలుస్తాడని ఇలాచేసాడని తాజా సమాచారం. ఈ దాడికి సంబందించిన న్యూస్ సోషల్ మీడియా లో తెగ హల్ చేస్తున్నాయి. పైగా కామెంట్స్ కూడా భారీగా వస్తున్నాయి

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *