‘రాధా.. తొందరపడొద్దు’.. వైసీపీ అధిష్ఠానం నుంచి ఫోన్!

వైసీపీలో విజయవాడ సెంట్రల్ సీటు వ్యవహారం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. విజయవాడ సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకు దాదాపుగా ఖరారైందన్న ప్రచారంతో వంగవీటి రాధా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇన్నాళ్లూ విజయవాడ సెంట్రల్ టికెట్ తనకే దక్కుతుందని ఆయన భావించారు. కానీ ఆశలు ఆవిరి కావడంతో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులతో సమావేశమయ్యారు. దీంతో పెద్ద ఎత్తున ఆయన ఇంటికి అనుచరులు చేరుకున్నారు. కానీ ఆయనను మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది.

ఈ వ్యవహారమే ప్రస్తుతం బెజవాడలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై రాధాతో పార్టీ అధిష్ఠానం సంప్రదింపులు జరుపుతోంది. తొందరపాటు నిర్ణయం వద్దని ఆయనకు ముఖ్య నేతలు ఫోన్‌లో సలహా ఇచ్చారు. మచిలీపట్నం, విజయవాడ ఈస్ట్, అవనిగడ్డ ప్రతిపాదనలపై రాధా మనస్తాపంతో ఉన్నట్లు తెలిసింది. సెంట్రల్ సీటే కావాలని ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే అధిష్ఠానం స్పష్టమైన ప్రకటన చేసే వరకూ రాధా అనుచరులు సంయమనం పాటించాలని పార్టీ నేతలు కోరుతున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *