పెళ్లి కాని యువకుడిని ఇంటికి పిలిచిన లేడీ.. ఇంతలో..

ఆమె వయసు 40 ఏళ్లు. అతడి వయసు 25 ఏళ్లు. ఆ యువకుడికి ఇంకా పెళ్లి కాలేదు. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఓ రోజు ఆ యువకుడిని తన ఇంటికి పిలిచింది. సీన్ కట్ చేస్తే తన ఇద్దరు కొడుకులతో కలిసి అతడిని చితకబాదింది. ఇంటి నుంచి తరిమేసింది. ఆ తర్వాత యువకుడు చనిపోయాడు. మరి ఆమె ఎందుకలా ప్రవర్తించింది. అసలు ఏం జరిగింది?

నరేందర్ అనే యువకుడి ప్రాణం పోవడానికి కారకురాలు కంత్రీ లేడీ అక్కులమ్మ. ఈమె చేసిన వెదవ పనికి చేతికొచ్చిన ఇద్దరు కొడుకులు నిందితులుగా మారారు. జువెనైల్ హోంకు వెళ్లారు. చివరికి చేసిన పాపానికి ఈమె జైలు పాలైంది.

హైదరాబాద్ హయత్ నగర్ ప్రాంతానికి చెందిన అక్కులమ్మ ఓ కాలేజీలో వంటమనిషి. ఈమెతోపాటు వంటపని చేసేవాడు నరేందర్. అతడికి ఇంకా పెళ్లి కూడా కాలేదు. 40 ఏళ్ల ఈమెకు 16, 17 ఏళ్ల యవసున్న ఇద్దరు కొడుకులున్నారు. భర్త ఉన్నాడు. కానీ నరేందర్, అక్కులమ్మ మధ్య గత కొంతకాలంగా ఇల్లీగల్ అఫైర్ నడుస్తోంది.

గత నెల 22న అక్కులమ్మ భర్త లింగయ్య ఊరికి వెళ్లాడు. వెంటనే తన ప్రియుడు నరేందర్‌కు ఫోన్‌ చేసి ఇంటికి పిలిచింది. అతడు వచ్చేలోగా తన ఇద్దరు కొడుకులను సినిమాకు పంపించింది. పిల్లలు తిరిగివచ్చే టైంకు నరేందర్‌ను పంపించేయాలని ప్లాన్ చేసింది అక్కులమ్మ. కానీ సీన్ రివర్స్ అయింది. వెళ్లిపొమ్మన్నా అతడు వినిపించుకోలేదు. ఇంతలో ఆమె ఇద్దరు కొడుకులు ఇంటికొచ్చారు. తన అక్రమ సంబంధం బయటపడుతుందని భావించిన కంత్రీ లేడీ ప్లేటు ఫిరాయించింది. అతడు ఎవరో తనకు తెలియదంటూ బుకాయించింది. అంతేకాదు ఇద్దరు కొడుకులతో కలిసి నరేందర్‌ను కొట్టి తరిమేసింది. తల్లి దుర్మార్గం తెలియని ఆ కొడుకులు ఇరుక్కుపోయారు.

ఈ అవమానంతో నరేందర్ కుంగిపోయాడు. రూం నుంచి రెండు రోజులు బయటకు రాలేదు. ఆరా తీసిన కాలేజీ సిబ్బంది చివరికి నరేందర్ ఇంటికెళ్లారు. అతడి పరిస్థితి చూసి హాస్పిటల్‌లో చేర్చారు. వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చారు. నరేందర్‌ను పరీక్షించిన డాక్టర్లు కిడ్నీ పాడయిందని, బలంగా దెబ్బలు తగిలి ఇంటర్నల్ పార్ట్స్‌ చెడిపోయాయని చెప్పడంతో వాళ్లు షాకయ్యారు. అప్పుడే నరేందర్ నోరు విప్పి నిజం చెప్పాడు.

చికిత్స పొందుతూ నరేందర్ మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు… అక్కులమ్మను, ఆమె ఇద్దరు కొడుకులను అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు ఇద్దరు మైనర్లు కావడంతో వాళ్లను జువెనైల్ హోంకు పంపించారు. అక్కులమ్మను రిమాండ్‌కు తరలించారు.

అక్రమ సంబంధం ఓ యువకుడి ప్రాణం తీసింది. అక్కులమ్మను జైలు పాలుచేసింది. ఆమె ఇద్దరు కొడుకులను నిందితులుగా మార్చింది. అక్కులమ్మ చేసిన తప్పుకు ఆమె కుటుంబం మొత్తం నాశనమైంది. నరేందర్‌ను బలితీసుకుంది. అక్రమ సంబంధం ఎప్పటికైనా ముప్పే అని ఈ ఘటన హెచ్చరిస్తోంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *