భర్త నిద్రపోతుంటే.. ప్రియుడితో ఏం చేసిందంటే

ఆపై పెట్రోల్‌ పోసి.. దహనం
ఏమీ తెలియనట్టు ఠాణాలో ఫిర్యాదు
మిస్టరీని ఛేదించిన పోలీసులు
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఓ మహిళ ఉదంతమిది. ఈ ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలం లింగానిపల్లికి చెందిన ఆనంద్‌ (35), మహేశ్వరీలకు పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఏడేళ్ల క్రితం ఉపాధి కోసం రాజేంద్రనగర్‌ సమీపంలోని శివరాంపల్లి వీకర్‌ సెక్షన్‌ కాలనీ కి మారారు. ఆనంద్‌ వంట పని చేస్తుండగా.. మహేశ్వరి అత్తాపూర్‌లో పలు ఇళ్లలో పనులు చేస్తూ జీవించేవారు. మహేశ్వరి రోజూ అత్తాపూర్‌ వెళ్లే క్రమంలో ఆటోడ్రైవర్‌ సంజూతో ఏర్పడ్డ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. సంజూ కోసం తన భర్త అడ్డును తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.

మే 7న ఆనంద్‌ నిద్రపోతున్న సమయంలో.. ఇద్దరూ కలిసి అతని గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని గంధంగూడ సమీపంలో మూసీ ఒడ్డున పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. ఆ తర్వాత మహేశ్వరి ఏమీ ఎరగనట్టు మే 20న తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ప్రవర్తనపై అనుమానమొచ్చిన పోలీసులు.. తమదైన శైలిలో విచారణ జరిపి.. అసలు విషయాన్ని బయటపెట్టారు. మహేశ్వరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. ‘సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌’లో భాగం గా ఆమెను హత్యాస్థలికి తీసుకెళ్లగా.. అక్కడ ఆనంద్‌ ఎముకలను గుర్తించినట్టు తెలిసింది. హత్య జరిగింది వాస్తవమేనని.. నిందితులను ఇంకా గుర్తించాల్సి ఉందని రాజేంద్రనగర్‌ అదనపు ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌ తెలిపారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *