ఎన్టీఆర్ బయోపిక్ లో వి వి వినాయక్…

సర్గీయ నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

Related image
అందులో ఒకటి ఎన్టీఆర్ కధానాయకుడు, రెండోవది ఎన్టీఆర్ మహా నాయకుడు. మొదటి పార్టును సంక్రాతి కానుకగా, రెండో పార్టును ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Image result for vv vinayak

అయితే ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి పాత్రలో రానా నటిస్తుండగా .. హరికృష్ణగా కల్యాణ్ రామ్ .. ఏఎన్నార్ గా సుమంత్ .. శ్రీదేవిగా రకుల్ .. జయప్రదగా తమన్నా నటిస్తున్నారు. ఎన్టీఆర్ తో సినిమాలను తెరకెక్కించిన దర్శకులలో కేవీ రెడ్డిగారిగా క్రిష్ .. విఠలాచార్యగా ఎన్.శంకర్ నటిస్తున్నారు.

Image result for vv vinayak

ఇక అలనాటి దర్శకదీరుడు దాసరి నారాయణరావు పాత్రలో వీవీ వినాయక్ నటించనున్నాడనేది తాజా సమాచారం. దాసరి నారాయణరావు ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘సర్దార్ పాపారాయుడు’ .. ‘బొబ్బిలి పులి’ ‘విశ్వరూపం’ చిత్రాలు సంచలన విజయాలను సాధించాయి. ఇక దాసరి పాత్ర ఎంతో మందిని పరిశీలించగా వినాయక్ అయితే బాగుంటుందని భావించి, ఆయనను దాసరి పాత్రకి ఒప్పించినట్టు తెలుస్తోంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *