ప్రముఖ సినీనటుడు..వైజాగ్ ప్రసాద్ కన్నుమూత

ప్రముఖ సినీనటుడు…75 ఏళ్ల వైజాగ్ ప్ర‌సాద్ ఇవాళ(అదివారం) తెల్ల‌వారు జామున క‌న్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న సినిమాల్లో నటించడంలేదు. ఆదివారం ఉద‌యం సోమాజిగూడ య‌శోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూసారు . వైజాగ్ ప్ర‌సాద్ మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఆయ‌న మృతి సినీ ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు అని అన్నారు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని, వారి కుటుంబానికి ప్ర‌గాడ సానుభూతి తెలియ‌జేస్తున్నారు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు.Related image
వైజాగ్ ప్ర‌సాద్ దాదాపు 170కి పైగా సినిమాల‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించారు. 1983 లో వచ్చిన బాబాయ్ అబ్బాయ్ నటుడిగా ఆయన మొదటి సినిమా. తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నువ్వు నేను సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన ఉదయ్ కిరణ్ కు… తండ్రిగా న‌టించి ప‌లు ఆఫ‌ర్స్ పొందారు. భ‌ద్ర‌, జై చిరంజీవ, నీరాజ‌నం, జెమిని,అల్ల‌రి బుల్లోడు, సుంద‌ర‌కాండ‌, రాణీగారి బంగ్లా, ఇది మా ప్రేమ క‌థ‌ వంటి సినిమాల‌లో ముఖ్య పాత్ర‌లు పోషించారు. వైజాగ్ ప్ర‌సాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. Image result for వైజాగ్ ప్రసాద్విశాఖపట్నం లోని గోపాలపట్నం ఆయన స్వస్థలం. వైజాగ్ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన పేరు వైజాగ్ ప్రసాద్ గా స్థిరపడిపోయింది. తండ్రి ఉపాధ్యాయుడు. తల్లిదండ్రులకు ముగ్గురు అమ్మాయిల తర్వాత నాలుగో సంతానం ఈయన. ప్రసాద్ కు ఒక చెల్లెలు కూడా ఉంది.

వైజాగ్ ప్ర‌సాద్ కు భార్య విద్యావ‌తి, ఇద్దరు పిల్లలున్నారు. రత్నప్రభ, రత్నకుమార్ ఇద్ద‌రు పిల్ల‌లు కంప్యూటర్ ఇంజనీర్లు. అమ్మాయి అమెరికాలో నివాసం ఉండగా అబ్బాయి లండన్ లో ఉంటున్నాడు.
#VizagPrasad #Actor #PassesAway

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *