విజయవాడ రెస్టారెంట్‌లో బిర్యానీలో.. బల్లి కలకలం

విజయవాడ, పటమట: గురునానక్‌ కాలనీ ప్రధాన రహదారి పక్కన టీచర్స్‌ కాలనీలోని ఓ రెస్టారెంట్‌లో చికెన్‌ బిర్యాని తింటున్న వారి ప్లేట్‌లో బల్లి ప్రత్యక్షమవ్వడం స్థానికంగా కలకలం సృష్టించింది. స్ధానికుల ఫిర్యాదుతో అధికారులు రంగంలోకి దిగారు.

బెంగుళూరుకు చెందిన విజయ్‌, బాలకృష్ణ ఇద్దరూ ఆ రెస్టారెంట్‌కు వచ్చి చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ ఇచ్చారు. కొంత తిన్న తర్వాత ఆ ప్లేటులో బల్లి కనపడటంతో వారు ఒక్కసారిగా గందరగోళంలో పడి అస్వస్థతకు గురయ్యారు. పక్క టేబుల్‌ వద్ద భోజనం చేస్తున్న స్థానికులు వారి పరిస్థితిని సిబ్బందికి తెలియజేశారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వినియోగదారులు సిబ్బంది తీరుపై భగ్గుమన్నారు. దీంతో హోటల్‌ సిబ్బంది సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి వారిద్దరిని తరలించారు.Related image వైద్య పరీక్షల తర్వాత కలుషిత ఆహారం తీసుకోవడంతో అస్వస్థతకు గురైనట్లు ధ్రువీకరించడంతో స్థానికులు ఫుడ్‌ సేఫ్టీ(ఆహార నియంత్రణ మండలి) అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్‌ సేప్టీ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ నూతలపాటి పూర్ణచంద్రరావు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి హోటల్లో బిర్యానీని సిబ్బంది తొలగించారు. హోటల్లో వంటలు చేస్తున్న ప్రాంతాలను, పరికరాలను పరిశీలించిన అధికారులు వంట గదులను పరిశీలించారు. అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేస్తున్నట్లు గుర్తించి వారికి నోటీసులు అందించి హోటల్‌ను తాత్కాలికంగా సీజ్‌ చేశారు.

Related image

అపరిశుభ్ర వాతావరణంలో వంటలు
హోటల్‌ గదులను పరిశీలించాం. అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేస్తున్నట్లు గుర్తించాం. నోటీసులు ఇచ్చి తాత్కాలికంగా మూసివేశాం. గతంలో విజయవాడలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలు ప్రముఖ హోటల్స్‌పైనా చర్యలు తీసుకున్నాం. ఇప్పటి వరకు మా సిబ్బంది స్వయంగా విజయవాడ 14, విసన్నపేట 6, బందరు 3 చొప్పున జిల్లాలో సుమారు 25 కేసులు నమోదు చేశారు. తర్వలో హోటల్‌ యాజమాన్యానికి సమావేశాలు నిర్వహిస్తాం. ఇలాంటివి పునరావృతమైతే లైసెన్సులు రద్దు చేస్తాం.
– నూతలపాటి పూర్ణచంద్రరావు, జిల్లా అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *