
బెజవాడలో దొంగల భయంతో యువకుల కాపలా!
బెజవాడ నగరంలో పెచ్చుమీరుతున్న దొంగతనాలతో పాటు దెయ్యాల ముసుగులో చోరీలకు పాల్పడటం పిల్లల్ని ఎత్తుకుపోయేందుకు ముఠాలు తిరుగుతున్నాయని వస్తున్న వదంతుల నేపథ్యంలో తాడిగడపలోని వసంతనగర్వాసులు స్వయంగా రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు. స్థానిక యువకులంతా ఒక గ్రూపుగా ఏర్పడి రాత్రిపూట పహారా కాస్తున్నారు.
దొంగలు, ఉన్మాదుల భయంతో ఉన్న ప్రజలకు అవగాహన కార్యక్రమం
రాష్ట్రంలో దొంగలు, ఉన్మాదుల భయంతో ఉన్న ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్దేశ్యంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బృందం పోలీస్ వారి సహకారంతో గ్రామాలలో పర్యటించాలని అనుకున్న దరిమిలా ఆత్మకూరు మండలంలోని వాసిలి గ్రామంలో నేడు గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం జరిగింది. దొంగతనాలు చేసేవాళ్ళు, గొంతులు కోసే ఉన్మాదులు అంటూ ప్రజలు అనవసర భయం అవసరం లేదని అటువంటివి మన ప్రాంతంలో ఎక్కడా జరగలేదని కాబట్టి ఇటువంటి పుకార్లను నమ్మవద్దని వాసిలి గ్రామ ప్రజలకు ఆత్మకూరు సిఐ అల్తాఫ్ హుస్సేన్ మరియు ఎస్సై నరేష్ గార్లు భరోసా కల్పించారు. మీరు ఇటువంటి సంఘటనలు ప్రత్యక్షంగా చూసినప్పుడు వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా గ్రామస్తులకు తెలిపారు .గ్రామ ప్రజలతో మీడియా బృందం మాట్లాడుతూ తాము ఎప్పటి వార్తలు అప్పుడు పేపర్లలో టీవీలలో ప్రచురిస్తూ ఉంటామని కానీ ఇటువంటి సంఘటనలు మన ప్రాంతంలో ఎక్కడ జరగనందున ప్రజలు అనవసర భయబ్రాంతులకు గురికావద్దని తెలిపారు గ్రామంలోని గ్రామము మరియు ఎస్సీ కాలనీలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని పోలీసు మరియు మీడియాబృందం వారి సందేశాన్ని ఆలకించారు .ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు