
ఆంధ్ర రాజధాని బెజవాడలో ట్రాఫిక్ రూల్స్ పరంగా చాల మార్పులు వచ్చ్హాయి. జరుగునో యాక్సిడెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని, ముఖ్యగా యువతని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ ని కఠినంగా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సాధారణంగా ట్రాఫిక్ పోలీస్ చేతులకి హెల్మెంట్ లేదా, బడి పేపర్లు లేకపోతే వందో, రెండొందలో ఇచ్చి అక్కడనుండి జారుకుంటారు.
ఇక నుంచి కృష్ణాజిల్లా వ్యాప్తంగా హెల్మెట్ లేకుండా బండి నడిపేవారికి భారీ జరిమానాలు విధించేందుకు రవాణా, పోలీస్ శాఖలు సిద్ధమయ్యాయి. ఒకవేళ హెల్మెట్ లేకుండా బండి నడిపితే రూ.1100, రెండోసారి పట్టుబడితే రూ.2,100 జరిమానా, మూడోసారి పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే విధంగా,మద్యం తాగి వాహనాలు నడిపితే కోర్టులో ప్రవేశపెట్టే విధంగా చర్యలు ప్రారంభించనున్నారు.
అయితే ఈరోజు కృష్ణాజిల్లా వ్యాప్తంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై 165 కేసులు నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు. వారికీ అధికారులు 44 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు.45 వేల రూపాయలు జరిమానాలు విధించారు.