విజయవాడ ఎయిర్‌ పోర్టు నుంచి సింగపూర్‌కు నేరుగా చార్టర్డ్‌ విమానాలు

విమానయాన సంస్థలకు ఆఫర్‌ !
ఆర్‌ఎఫ్‌పీ విడుదల చేసిన ఏడీ సీఎల్‌
సుమారు లక్ష మంది ప్రజాభిప్రాయ సేకరణ
నూరు శాతం సింగపూర్‌కు ఓటు
అంతర్జాతీయ హోదా అందుకున్న విజయవాడ ఎయిర్‌ పోర్టు నుంచి సింగపూర్‌కు నేరుగా చార్టర్డ్‌ విమానాలు నడిపేందుకు అవకాశాన్ని పరీక్షించుకోవసిందిగా విమానయాన సంస్థలకు ప్రభుత్వం ఆఫర్‌ ప్రకటించింది. సింగ పూర్‌కు విమానాలు నడిపేందుకు రాష్ట్ర ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీఎల్‌) ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌)ను విడుదల చేసింది. ఔత్సాహిక సంస్థలు ఈ నెల 22వ తేదీ లోపు తమ సీల్డ్‌ కొటేషన్లను సమర్పిం చాల్సి ఉంటుంది. ఈ నెల 22న బిడ్లను తెరుస్తారు. వయ బిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌)కు ఏ సంస్థ తక్కువగా కోట్‌ చేస్తుందో ఆ సంస్థకు విమాన సర్వీసులు నడిపే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. చార్టర్డ్‌ ఫ్లైట్‌లో తల సరి సీటుకు వీజీఎఫ్‌ ఎంత సూచిస్తారన్నది విమానయాన సంస్థల ఎంపికను ప్రధానంగా నిర్ణయిస్తుంది.

Image result for gannavaram airport

ఇప్పటికే సిల్క్‌ ఎయిర్‌వేస్‌ సంస్థతో ఒప్పందం జరిగిందన్న ప్రచా రం జరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం నుంచి తాజాగా ఆర్‌ఎఫ్‌పీ విడుదల కావటం గమనార్హం! సిల్క్‌ ఎయిర్‌వే స్‌ విదేశీ విమానయాన సంస్థ. స్వదేశీ విమానయాన సంస్థల నుంచి కూడా ఆసక్తిని తెలుసుకోవటానికి, అవకాశం కల్పించటానికి విమానయాన సంస్థల మధ్య పోటీ పెట్టాలన్న ఆలోచనలో రాష్ట్రప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ ఏడవ తేదీ నుంచి సింగపూర్‌కు విమానాలు నడిపేందుకు అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

Related image

దాదాపుగా లక్ష మంది నుంచి ‘సింగపూర్‌’ విమానం కోసం ఆసక్తి
అంతర్జాతీయ హోదా వచ్చి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ సర్వీసు కూడా విజయవాడ నుంచి ఎగరలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసును నడిపించాలన్న ఆలోచన చేస్తోంది. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసు నడిపే విషయంలో ప్రయాణికులు, ప్రజల ప్రతిస్పందన ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా అభిప్రాయసేకరణ జరిపింది. ఈ అభిప్రాయ సేకరణ ప్రకారం వెబ్‌సైట్‌లో సానుకూలంగా 79,404 మంది సింగపూర్‌కు విమాన సర్వీసు నడపాలని సబ్‌మిట్‌ చేశారు. ఏడీసీఎల్‌ సంస్థ ఇ-మెయిల్స్‌ ద్వారా కూడా అభిప్రాయ సేకరణ జరిపింది. ఇ- మెయిల్స్‌ ద్వారా 1,335 మంది సానుకూలంగా స్పందించారు. సామాజిక సందేశ మాధ్యమం ‘వాట్స్‌యాప్‌’ ద్వారా జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో 4,020 మంది సానుకూలంగా స్పందించారు. అలాగే 1,993 మంది ఎస్‌ఎంఎస్‌ ద్వారా తమ ఆసక్తిని తెలిపారు

Image result for gannavaram airport

పుట్టపర్తి, నాగార్జునసాగర్‌లకు 9 సీటర్‌ విమానాలు!
అనంతపురం జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి, గుంటూరు జిల్లా నాగార్జునసాగర్‌ ఎయిర్‌పోర్టుకు కూడా విమానాలు నడపటానికి ప్రభుత్వం ఆసక్తితో ఉంది. ఈ రెండు ప్రాంతాలకు 9 సీటింగ్‌ కలిగిన ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆధ్మాత్మిక ధామం పుట్టపర్తి. ప్రతిరోజూ వేలాది సంఖ్యలో యాత్రికులు పుట్టపర్తిని సందర్శిస్తుంటారు. అలాగే నాగార్జునసాగర్‌ గొప్ప పర్యాటక ప్రాంతం. నాగార్జునసాగర్‌కు కూడా నిత్యం వందలాది మంది తరలివస్తుంటారు. ఈ రెండు ప్రాంతాలకు తొమ్మిది సీటర్‌ విమానాలను నడపటానికి కూడా ప్రజాభిప్రాయ సేకరణ కోరుతోంది. రాష్ట్ర ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీఎల్‌) తన వెబ్‌పోర్టల్‌ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ కోరింది. ఆదివారం నాటికి పుట్టపర్తికి 658 మంది, నాగార్జున సాగర్‌ ఎయిర్‌పోర్టుకు 515 మంది తమ ఆసక్తిని వ్యక్తపరుస్తూ సబ్‌మిట్‌ చేశారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *