విజయవాడలో బోట్ రేస్ కు సర్వం సిద్ధం..

vijayawada f1h2o powerboat racing

విజయవాడ కృష్ణానదిలో జరగనున్న ఫార్ములా వన్‌ బోట్ రేస్‌ కు సర్వం సిద్దమైంది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఎఫ్‌1హెచ్‌2వో పవర్ బోట్ రేసులు జరగనున్నాయి. ఈ రేసులో వివిధ దేశాలకు చెందిన 10 జట్లు పాల్గొంటాయి. ప్రపంచవ్యాప్తంగా 8 దేశాల్లో ప్రపంచ బోట్‌ రేస్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహిస్తున్నారు.. ఇప్పటి వరకూ 4 దేశాల్లో పూర్తయింది. ఈ రేస్‌లో అతిధ్య జట్టుగా అమరావతి టీం పాల్గొంటుంది. భారతదేశంలో ఎఫ్ 1 బోట్ రేస్ చివరిసారిగా 2004లో ముంబైలో జరిగింది.

విజయవాడలో పర్యాటక శాఖ సీఈవో హిమాన్షు శుక్లా మాట్లాడుతూ… అమరావతి కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం తొలిసారి రేసును నిర్వహిస్తోంది. 33 దేశాల నుంచి సుమారు 1,000 మంది విదేశీయులు ఈ పోటీల్లో పాల్గొంటారు. 9 టీములుగా 3 రోజుల పాటు పోటీలు జరుగుతాయని తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారితోపాటు, పర్యాటకులకు కూడా భద్రత కల్పించడానికి డీజీపీ పరివేక్షణలో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. వచ్చే నెలలో కేరళలో మాదిరి తెడ్లతో నడిపే పడవల పోటీలు కూడా నిర్వహిస్తాం అని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు పోటీలకు సిద్దమైన బోట్లను కలెక్టర్ లక్ష్మీకాంతం పరిశీలించారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *