అనిల్ రావిపూడితోనే వెంకటేశ్ .. త్వరలో సెట్స్ పైకి మల్టీ స్టారర్

తేజ దర్శకత్వంలో వెంకటేశ్ ‘ఆట నాదే .. వేట నాదే’ అనే సినిమా మొదలవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరో వైపున బొమ్మరిల్లు భాస్కర్ .. త్రివిక్రమ్ ఇద్దరూ కూడా త్వరలో వెంకటేశ్ తో సినిమా చేయనున్నట్టు చెప్పారు. ఇక వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా ఒక సినిమా చేయడానికి దర్శకుడు అనిల్ రావిపూడి రెడీ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో అసలు వెంకటేశ్ ముందుగా ఏ దర్శకుడితో కలిసి ముందుకు వెళతాడనే విషయంలో అభిమానులు అయోమయానికి లోనవుతున్నారు.

తేజను చూస్తే .. ముందుగా ఎన్టీఆర్ బయోపిక్ ను మొదలెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా వున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ పూర్తి స్క్రిప్ట్ తో సిద్ధంగా వున్నాడు. అయితే టైటిల్ తో సహా ఓకే అనిపించుకుని .. ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేసి అనిల్ రావిపూడి ముందున్నాడు. అందువలన అనిల్ రావిపూడితోనే వెంకటేశ్ సెట్స్ పైకి వెళుతున్నాడని సమాచారం.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *