
టాలీవుడ్ హీరోలలో ఫ్యామిలీ ఆడియన్సు దెగ్గరైన హీరో విక్టరీ వెంకటేష్. సురేష్ ప్రొడక్షన్ అధినేత దగ్గుపాటి రామానాయుడు ద్వితీయ కుమారుడైన వెంకటేష్ కలియుగ పాండవులు అనే మూవీ తో తెలుగు తెరకి పరిచయం అయ్యాడు. తరువాత వరసగా విజయవంతమైన సినిమాలు చేస్తూ ఎందరో అభిమానులతో పాటు ఎన్నో అవార్డులు తన ఖాతాలో వేసుకొని విక్టరీ వెంకటేష్ అనిపించుకున్నాడు. వెంకటేష్ అందిరితో కలిసిపోయే స్వభావం కలవాడు.
ఇండస్ట్రీ లో ఎటువంటి ఇగో లేని హీరో ఉన్నాడు అంటే వెంకటేష్ అని చెప్పుకోవచ్చు. ఏ టాప్ హీరో చేయని ప్రయోగాలు వెంకటేష్ చేసారు, ఆ కోవలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మూవీలో మహేష్ బాబు తో నటించి ముల్టీస్టార్ కు తెర లేపాడు. తరువాత రామ్ తో మసాలా మూవీ, పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల మూవీ చేసి తనకెటువంటి ఇగో లేదని నిరూపించుకొని, కథ బాగుంటే పెద్ద చిన్న అనే బేధం లేకుండా ఏ హీరోతోనైనా నటిస్తాని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లోనే అనిల్ రావిపూడి దర్శకత్యం లో వరుణ్ తేజ్ తో కలిసి ముల్టీస్టార్ చేస్తున్నాడు. అదే బ్యానర్ లో రిలీజ్ కి సిద్దమైన శ్రీనివాస కళ్యాణం చిత్రానికి దర్శకుడు సతీష్ వేగ్నేశ కోరికమేరకు అడిగినవెంటనే తన గాత్రాన్ని సినిమాకోసం ఇచ్చాడు. ఈ విషయాన్ని దర్శకుడు సతీష్ వేగ్నేశ పేస్ బుక్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు.