వెంకటేశ్ కూతురి ప్రేమపెళ్లి.. అల్లుడు ఎవరంటే..

venkatesh-arrange-love-marriage-for-his-daughter-asritha-who-believed-loving-business-family-boy
విక్టరీ వెంకటేష్ పలు మల్టీస్టారర్ చిత్రాలతో బిజీగా మారుతున్నాడు. వైవిధ్య భరితం ఉన్న పాత్రలని ఎంచుకుంటూ వెంకటేష్ దూసుకుపోతున్నాడు. ఇక వెంకటేష్ రియల్ లైఫ్ లో తండ్రిగా కీలక పాత్ర పోషించాలన్సి సమయం వచ్చినట్లు తెలుస్తోంది. వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం త్వరలో జరగబోతున్నట్లు ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది. ఈ వివాహం గురించి ఆసక్తికరమైన విషయాలు ప్రచారం జరుగుతున్నాయి.


పెద్ద కుమార్తె ఆశ్రిత ప్రేమకు వెంకటేష్ పచ్చ జెండా ఊపాడట. తనకు పరిచయం ఉన్న యువకుడితో ఆర్షిత ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఆశ్రిత ప్రేమించిన వ్యక్తి మరెవరో కాదు.. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడని తెలుస్తోంది. చాలా కాలంగా మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారిందట. ఇరువురూ తమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పెద్దలు వివాహానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఇటీవలే వెంకీ సోదరుడు సురేష్ బాబు ఇటీవలే అబ్బాయి కుటుంబ సభ్యులని కలసి పెళ్ళికి సంబందించిన విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే నిశ్చితార్థం నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అబ్బాయి తండ్రి రఘురామి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి స్నేహితుడని సమాచారం. వివాహం కనీవినీ ఎరుగని రీతిలో వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ ప్రస్తుతం ఎఫ్2 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ ఓ కొలిక్కి రాగానే వివాహానికి సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయట.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *