వక్కంతం వంశీ రొండో సినిమా ఫిక్స్

రచయితగా పలు విజయాలను అందుకుని, అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’తో దర్శకుడిగా మారారు వక్కంతం వంశీ. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా మంచి టాక్‌నే‌ అందుకుంది. దీని తర్వాత ఆయన తన కొత్త ప్రాజెక్టుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో రవితేజ కథానాయకుడిగా నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రవితేజ సినీ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమా ‘కిక్‌’. ఈ కథను వక్కంతం వంశీ రాశారు. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్లో సినిమా అనగానే.. ఆసక్తి నెలకొంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇటీవల ‘నేల టిక్కెట్టు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ప్రస్తుతం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’లో నటిస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకుడు. ఇలియానా కథానాయిక. ఇందులో రవితేజ మూడు కోణాల్లో సాగే పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. మరోపక్క ఆయన ‘తెరి’ తెలుగు రీమేక్‌లోనూ నటించనున్నారు. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకుడు. ఈ సినిమాకు ఇటీవల కొబ్బరికాయ కొట్టారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *