ఉక్కు దీక్షలో ఊహించని నేత

ఉక్కు దీక్షలో ఊహించని నేత
కడప: టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ చేస్తోన్న ఉక్కు దీక్షా శిబిరానికి ఊహించని నేత వచ్చారు. సీఎం రమేశ్‌ను పరామర్శించారు. ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఉక్కు దీక్ష చేస్తోన్న సీఎం రమేశ్‌కు మద్దతు పలికారు. ఆయన ఎవరో కాదు. సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్ లక్ష్మీ నారాయణ. ఇటీవలే రిటైర్‌మెంట్ తీసుకుని సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న లక్ష్మీ నారాయణ సీఎం రమేశ్‌ దీక్షకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంకా ఏ పార్టీలో చేరతారో చెప్పని లక్ష్మీ నారాయణ సీఎం రమేశ్ ఉక్కు దీక్షా శిబిరాన్ని సందర్శించడం, ఆయనకు మద్దతు ప్రకటించడం ఏపీలో తాజా సంచలనంగా మారింది. స్వయం సేవక్ అయిన లక్ష్మీ నారాయణ స్వయం సేవక్. బీజేపీలో కానీ, జనసేనలో కానీ చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే అనూహ్యంగా సీఎం రమేశ్‌ ఉక్కు దీక్షకు మద్దతు ప్రకటించడం కలకలం రేపుతోంది. లక్ష్మీ నారాయణ టీడీపీలో చేరే అవకాశం ఉందా అని శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అయితే దీనిపై లక్ష్మీ నారాయణే క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *