బాబు గారిని ఒక అవకాశం ఇవ్వమంటున్నారు, ఎందుకో తెలుసా..

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ టీజేపీ పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. కానీ సీట్ల సర్దుబాటు విషయంలో ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ విషయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవనున్నారు. సేవ్‌ నేషన్‌ నినాదంతో రాహుల్‌తో జరిగే భేటీలో తెలంగాణలోని మహాకూటమి భాగస్వామ్యపక్షమైన టీడీపీ సీట్లు, నియోజకవర్గాల కేటాయింపుపైనా దాదాపుగా స్పష్టత వస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

చందబాబు ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో చివరి ప్రయత్నంగా నగరానికి చెందిన కొందరు నేతలు అమరావతికి వెళ్లారు. అక్కడ ఆయనను కలిసి తమకు అవకాశం కల్పించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. టీడీపీ నగరాధ్యక్షుడు ఎమ్మెన్‌ శ్రీనివా్‌సరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకెల దీపక్‌రెడ్డి బుధవారం అధినేతను కలిసి ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌ స్థానాలు కేటాయించాలని కోరుకున్నారు.

టీడీపీ పార్టీ ముషీరాబాద్‌లో పుట్టిందని, ఇప్పుడు ఆ నియోజకవర్గం నుంచి పోటీచేస్తే గెలవడం ఖాయమని, అక్కడ కేడర్‌ మన వెంటే ఉందని ఎమ్మెన్‌ తెలిపారు. అయితే ఇక్కడ 30 ఏళ్లుగా అవకాశం రాలేదని ఈ సారి అవకాశం ఇస్తే ముషీరాబాద్‌లో నుంచి పోటీ చేస్తాననని ఆయన అన్నారు. ఖైరతాబాద్‌లో పార్టీ బలంగా ఉందని, అవకాశం ఇస్తే విజయం సాధిస్తామని దీపక్‌రెడ్డి పేర్కొన్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *