రేపే రామ్‌చరణ్‌,బోయపాటిల చిత్రం ఫస్ట్‌లుక్‌

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే ఈ చిత్రం మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. ‘స్టేట్‌ రౌడీ’, ‘వినయ విధేయ రామ’ అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విటర్ ద్వారా తెలిపింది. రేపు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అయితే ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కు సరసన కియారా అడ్వాణీ నటిస్తుంది. ఇటీవల సినిమా చిత్రీకరణ పూర్తయింది. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ఇందులో విలన్ పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఇందులో రామ్‌చరణ్‌ కొత్త లుక్‌లో ఆకట్టుకోనున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌లో నటించనున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *