కోపంతో మహానాడు నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే

టీడీపీలో నగర కమిటీ లొల్లి… ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆగ్రహానికి కారణమైంది. కార్యకర్తల వాగ్వాదంతో ఆయన కోపంతో వెళ్లిపోవాల్సి వచ్చింది. ఉదయం టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ సంఘటన పార్టీలో చర్చనీయాంశమైంది. ఖమ్మంలో టీడీపీ మినీ మహానాడుకు ఇరు జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అయితే ఉదయం ఖమ్మం నగరంలోని కొన్ని డివిజన్లకు చెందిన కార్యకర్తలు ఖమ్మంలోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చారు. ఈ క్రమంలో నాయకులంతా మినీమహానాడు వేదిక వద్దకు వెళ్లాలంటూ అక్కడి నాయకులు ఆదేశాలిచ్చారు. దీంతో కొందరు కార్యకర్తలు ఖమ్మం నగర కమిటీని తేల్చేంత వరకు వెళ్లేది లేదంటూ భీష్మించారు. నానా హడావిడి చేస్తుండడంతో విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీ కార్యాలయానికి వచ్చారు. అక్కడ నగర కమిటీ కార్యకర్తలు, డివిజన్‌ అధ్యక్షుడు, నాయకులతో మాట్లాడారు. ఈ క్రమంలో వారు సండ్ర ఎదుటే వాగ్వాదానికి దిగారు.. ‘మూడేళ్లు కావస్తున్నా నగర కమిటీ వేయరా…? ఎందుకు వేయరు..? అని ప్రశ్నించారు. విషయాన్ని నామానాగేశ్వరరావుకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో మినీమహానాడు పూర్తయిన తర్వాత కమిటీని వే ద్దామని ముందైతే కార్యక్రమానికి రావాలంటూ ఆయన కార్యకర్తలకు సూచించారు. దీంతో వారు కార్యక్రమానికి హాజరయ్యారు. మినీ మహానాడు తర్వాత కూడా నామ నాగేశ్వరరావు వేదికనుంచి వెళ్లిపోవడంతో తిరిగి నగరక మిటీ ఏర్పాటు అంశాన్ని కార్యకర్తలు మళ్లీ చర్చకు తీసుకొచ్చారు. పార్టీ కార్యాలయంలో కూర్చున్న సండ్ర వెంకటవీరయ్య, మద్దినేని స్వర్ణకుమారి, తదితరులతో మాట్లాడుతుండగా కార్యకర్తలు మళ్లీ నగరకమిటీపై చర్చకు పట్టుపట్టారు… దీంతో కార్యకర్తల్లో ఒకరు సండ్రను ఎద్దేవా చేయడంతో ఆయన కోపోద్రిక్తులయ్యారు. విసురుగా బయటకెళ్లిపోయారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *