
తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని తెలంగాణ ఆపద్దర్మ మంత్రి ఈటెల రాజేందర్ విమర్శించారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ పోరాడితే ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలయిక తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపబోదని అన్నారు. తెలంగాణ ప్రజలు మరింత కసితో టీఆర్ఎస్కు ఓటు వేస్తారని ఈటల ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ చంద్రబాబు 195 కేసులు వేసి తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. బాబు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి పథకం కట్టవద్దని చెప్పి ఒత్తిడి తీసుకువచ్చారని ఆయన విమర్శించారు.
టీడీపీ-కాంగ్రెస్ కలయికవల్ల తెలంగాణలో పంటపొలాలకు నీరు రావేమోననే భయం ప్రజల్లో నెలకొందని, మహాకూటమిని తెలంగాణ వ్యతిరేక కూటమిగా చూస్తారని ఆయన అన్నారు. చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పేకంటే తన రాష్ట్రాన్ని బాగా చూసుకోవాలని ఈటల సూచించారు.
ఈటల రాజేంద్రప్రసాద్ అంటమే కాదు సగుట అన్నగారి అభిమానులు కూడా టీడీపీ ని కాంగ్రెస్ కి తాకట్టు పెట్టాడని అంటున్నారు. ఎందుకంటే ఆరోజుల్లో కాంగ్రెస్ దుర్మార్గపు పాలనా, తెలుగువారిని ఇబ్బందులు పెట్టిన తీరును చూసి అన్న ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించాడు. అది అప్పుడున్న పరిస్థితులు. అటువంటి పార్టీతో చంద్రబాబు కలవడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా విమర్శిస్తున్నాడు.