ఆయనే నా నిజ జీవితంలో విలన్ : తారా చౌదరి

నటి తారా చౌదరి వ్యవహారం ఒకప్పుడు పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో అసలేం జరిగింది..? ఈమె ఎందుకిలా తయారయ్యారు? తారా జీవితం ఇలా కావడానికి అసలు కారకులెవ్వరు..? అనే విషయాలు స్వయాన తారా చౌదరీయే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతేకాదు ఓ వ్యక్తి గురించి ఆమె సంచలన నిజాలు బయటపెట్టింది.

తారా చౌదరి మాటల్లోనే…

Related image
” ఇదంతా శంకర్ రెడ్డి అనే వ్యక్తి కక్షే. నా జీవితానికి ఓ ఇన్సిడెంట్ సృష్టించిన, నా లైఫ్ ఇలా పబ్లిసిటీ అవ్వడానికి ఆయనే కారణం. నా జీవితంలో ఆయన విలన్. శంకర్ రెడ్డి అనే వ్యక్తి నేను మొదట హైదరాబాద్‌కు వచ్చింది మొదలుకుని 2012 వరకూ ఒకట్రెండు విషయాల్లో నేను ఇలా అవ్వడానికి పూనుకున్న వ్యక్తి. శంకర్ రెడ్డి ఏసీపీ, సీఐగా ఉన్నప్పుడు ఆ రేంజ్‌‌లో రియాక్ట్ అవ్వడానికి ఆయన వెనుక ఏదో ఒక శక్తి ఉంది. అందుకే ఆయన తప్పుడు కేసును రిజిస్టర్ చేసి నన్ను ఇలా చేశారు. ఆయన వెనుక ఏదో ఒక శక్తుంది కాబట్టే అంత ధీమాతో విచ్చలవిడిగా ప్రవర్తించారు.

ఇలా నా ఒక్క విషయంలోనే కాదు.. నాంపల్లి కోర్టు దగ్గర చాలా మంది ఆయన గురించి చెప్పారు. మేం శంకర్ రెడ్డిపై హైకోర్టులో రిట్ వేశామని.. మానవ హక్కుల సంఘాన్ని సంప్రదించామని ఇలా చాలా మంది ఆయనపై కేసులు పెట్టారు. బంజారాహిల్స్‌లో ఏసీపీగా వచ్చిన తర్వాత ల్యాండ్ వివాదాల్లో.. కేసు కోసం వెళ్లినవారిని ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయి. ఇవన్నీ నేను చెబుతున్నవి కాదు జనాలు చెబుతున్నవే. ఆయనేంటో అందరికీ తెలుసని ఆఖరికి అడ్వకేట్స్‌ కూడా చెప్పారు.

Related image

శంకర్ రెడ్డిపై 2007లో మహిళా కమిషన్‌లో కేసు పెట్టడం వల్ల నన్ను టార్గెట్ చేశారు. నేనేం రాజకీయ నేతను కాదు.. గూండాను అంతకంటే కాదు.. నేనస్సలు స్కాంలు చేయలేదు.. నేనొక సాధారణ ఆడపిల్లను అంతే. నా మీద తప్పుడు కేసులు బనాయించి రకరకాలుగా పుకార్లు సృష్టించి.. ఫలానా వారితో పరిచయాలున్నాయని నన్ను బ్లేమ్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. ఇలా ఒక ఆడపిల్ల జీవితాన్ని మీడియాపరంగా నాశనం చేసే విధంగా చేయడం సబబుకాదు. శంకర్ రెడ్డికి.. ఆయన కుటుంబానికి నా ఉసురయితే తగుల్తుంది” అని తారా చౌదరి శాపనార్థాలు పెట్టింది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *