25న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయండి

తిరువూరు: విద్యారంగం పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరనసగా ఈనెల 25న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సోమేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. Related imageస్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో శనివారం ఆయన విద్యార్థులతో కలిసి బంద్‌ గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా చేస్తామని చెబుతున్న ప్రభుత్వం విద్యారంగ సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. Image result for 25th students Bandh vijayawadaజ్ఞానభేరి పేరిట ఎన్నికలకు ముందు ప్రచారభేరి ప్రారంభించిందని ఎద్దేవా చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌కే ఖదీర్‌, మోహనకృష్ణ, లోహిత్‌, నవీన్‌, నాగరాజు, బి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Students coming out of a college in Vijayawada after student unions called an educational bandh on 25th

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *