ధోనికి, గంభీర్‌ కు గాలం వేస్తున్న బీజేపీ…

star cricketers MS dhoni and gowtham gambhir into bjp party

టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ, గౌతమ్‌ గంభీర్‌ లు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి . వీరిద్దరికి దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. వీరిలో ఒకరు ప్రశాంతంగా కనపడితే… మరొకరు దూకుడుగా వ్యవహరిస్తారు.

గంభీర్‌ పుట్టింది ఢిల్లీలోనే. ప్రస్తుతం అక్కడి జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. దేశభక్తి విషయంలో గంభీర్ ముందుంటాడని, ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందిస్తాడని.. కాబట్టి అతడిని ఢిల్లీ నుంచి బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నట్టు తాజా సమాచారం. అక్కడ స్థానిక బీజేపీ ఎంపీ మీనాక్షిపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉండడంతో ఆమె స్థానంలో గంభీర్‌ను నిలపాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.

అదేవిధంగా ధోనీని ఝార్ఖండ్‌ నుంచి పోటీ చేయించాలని బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తుంది. ధోనీకి అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన కున్న క్రేజ్ ను తమ పార్టీవైపు తిప్పికొనేందుకు ధోనీని బుట్టలో వేసుకోవాలని బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఈ ఇద్దరు ఆటగాళ్లు ససేమిరా అంటే.. కనీసం వారితో ప్రచారమైనా చేయించుకోవాలని పథకం రచిస్తున్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వీరిద్దరిలో ఎవరు ఎన్నికల బరిలోకి దిగేది తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే..

Gambhir, Dhoni may be BJP candidates in 2019 LS polls

Gautam Gambhir and MS Dhoni to contest 2019 Lok Sabha elections on BJP

M S Dhoni & Gautam Gambhir Likely To Join BJP

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *