
బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు తమన్. ఆ తరువాత టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేస్తూ వైశాలి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే దేవిశ్రీ ప్రసాద్ తన జోరును కొనసాగిస్తోన్నాడు. ఆ పోటీని తట్టుకొని తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.
యూత్ ను పట్టుకునే బీట్స్ తో పాటలను హుషారుగా పరుగులు తీయించాడు. తెలుగుతో పాటు తమిళ సినిమాలు కూడా చేస్తూ, చాలా వేగంగా పాటలు చేసి ఇవ్వగలిగిన సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
కెరియర్ తొలినాళ్లలో చాల ఇబ్బందులు ఎదురుకున్నాడు తమన్. ఆ తరువాత వెనుదిరిగి చూసుకోకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ 100 సినిమాలను పూర్తిచేసేశాడు. ‘అరవింద సమేత వీర రాఘవ’ ఆయన స్వరపరిచిన 100వ సినిమా.
ఈ సినిమా కి సంగీతాన్ని ఇవ్వడంతో పాటు, తారక్ అన్నయ్య ఋణం తీర్చుకున్నాడు తమన్. తాను సంగీత దర్శకుడిగా పనిచేసిన 100వ సినిమా ఇంతటి భారీ విజయాన్ని సాధించినందుకు తనకి చాలా సంతోషంగా ఉందని తమన్ చెప్పాడు. మొత్తానికి చిన్న వయస్సులోనే తమన్ చాలా అరుదైన రికార్డునే సొంతం చేసుకున్నాడు.