రాజమౌళి RRR ముహూర్తం ఫిక్స్…

#rrrpics

బాహుబలి సినిమాతో యావత్ దేశాన్ని తన వైపుకు తిప్పుకున్న టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి. అందుకే రాజమౌళి లో సినిమాలో ఎంత పెద్ద హీరో నటించిన హీరో మాత్రం జక్కన్నే అవుతాడు. బాహుబలి తరువాత
అయన తెరకెక్కించబోయే సినిమా “ఆర్ ఆర్ ఆర్ ”. ఎన్టీఆర్ ,చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

బాహుబలి సిరీస్ ల తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు టాలీవుడ్ టాప్ హీరోలైన ఎన్టీఆర్ , చరణ్ ల లాంటి మాస్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ మూడు సినిమాలు చేయగా ఆ మూడు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. ఇక చరణ్ ఒక్క మగధీర మాత్రమే చేసాడు. ఆ సినిమాతో ఇండస్ట్రీ దుమ్ము దులిపాడు.

ఈ సినిమాకి సంబందించిన ప్రారంభోత్సవ డేట్ ని రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు. నవంబర్ 11 న ఉదయం 11 గంటలకు ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్ లో నటించనున్నట్లు తెలుస్తోంది.

స్వాతంత్ర్యానికి పూర్వం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకు హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ , చరణ్ ల అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయంలో ఓపెనింగ్ డేట్ ప్రకటించడంతో ఇద్దరి హీరోల అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
SS Rajamouli’s ‘RRR’ with Ram Charan and Jr NTR
SS Rajamouli confirms opening date

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *