
ఈ వీడియో చుస్తే అర్ధంఅవ్వుది మరో హైటెక్ సిటీ అమరావతిలో
రాజధాని అమరావతిలో ఆరు ప్రముఖ విద్యాసంస్థలు వేళ్లూనుకుంటున్నాయి. వీటికి ప్రభుత్వం ఇప్పటికే స్థలాలు కేటాయించగా త్వరలోనే నిర్మాణాలు ప్రారంభించనున్నాయి. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విట్) యూనివర్సిటీ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అమరావతిలో విట్తో పాటు, ఎస్ఆర్ఎం, అమృత, బీఆర్షెట్టి, ఇండో-యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ) సంస్థలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించింది.
ఎన్ఐడీకి శాకమూరు పరిధిలో ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. భవన నిర్మాణ బాధ్యతల్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్బీసీసీకి ఎన్ఐడీ అప్పగించింది.
విట్కి ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. ఐనవోలు, శాకమూరు, వెలగపూడి పరిధిలో ఆ సంస్థకు సీఆర్డీఏ వందెకరాలు ఇప్పటికే అప్పగించింది.
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏర్పాటుకీ ప్రభుత్వం నీరుకొండ పరిధిలో 200 ఎకరాలు కేటాయించింది.
అమృత యూనివర్సిటీకి మొదట 150 ఎకరాలు, ఆ తర్వాత 50 ఎకరాల్ని ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నవులూరు వద్ద స్థలం కేటాయించింది.
బీఆర్షెట్టి సంస్థకు దొండపాడు పరిధిలో వందెకరాల్ని ప్రభుత్వం కేటాయించింది.
ఇండో-యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థకు 150 ఎకరాలు (మొదట దశలో 50, రెండో దశలో 100) ఎకరాల్ని ప్రభుత్వం కేటాయించింది.