శ్రియ పెళ్లయిపోయింది.ఎవర్నీ పిలవలేదు.. ఎందుకో తెలుసా

శ్రియ పెళ్లయిపోయింది.ఎవర్నీ పిలవలేదు.. ఎందుకో తెలుసా
ప్రముఖ నటి శ్రియ శరణ్ (37) పెళ్లి చేసుకున్నది. రష్యాకి చెందిన టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కోస్ చీవ్ ని వివాహం చేసుకున్నది. మార్చి 12వ తేదీ ముంబైలోని తన సొంత ఇంటిలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. చాలా కొద్ది మంది సినీ ప్రముఖులకు మాత్రమే ఆహ్వానించారంట. ఆర్భాటం లేకుండా చాలా సింపుల్ గా ఈ పెళ్లి జరిగిందని ముంబై పత్రికలు తెలిపాయి. ఈ పెళ్లికి మనోజ్ బాజ్ పేయ్, షబానా ఆజ్మీ లాంటి క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే అటెండ్ అయ్యారంట. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని రెండేళ్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై శ్రియ ఎప్పుడూ స్పందించలేదు. అదే విధంగా రెండు నెలల క్రితం జైపూర్ లో పెళ్లి అని వార్తలు వచ్చాయి. అప్పట్లో ఖండించారు. ఇప్పుడు మాత్రం ఈ పెళ్లి వార్తలను శ్రియ కుటుంబం ఖండించలేదు. జాతీయ ఛానల్స్ అన్నీ శ్రియ పెళ్లి అయిపోయిందని ఈసారి ప్రముఖంగా ప్రచురించాయి.

2001లో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించింది శ్రియ. ఈ 16 ఏళ్ల సినిమా కెరీర్ లో వందకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళం, మళయాళం, హిందీ సినిమాల్లో నటించింది శ్రియ. ఇంగ్లీష్ సినిమాల్లో మెరిసింది. 37 ఏళ్ల శ్రియ ఇప్పటికీ తన నటనతో పలు అవకాశాలు దక్కించుకుంటూ.. సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. తెలుగు, తమిళంలో అందరు టాప్ హీరోస్ తో నటించింది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *