
వెనుక సీట్లోని వారిని గుర్తుపట్టలేకపోయిన ప్రత్యక్ష సాక్షి సల్మాన్ ను మాత్రమే గుర్తుపట్టడంతో ఖరారైన శిక్షశిక్ష నుంచి తప్పించుకున్న సోనాలీ, టబు రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ జోధ్ పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనతో పాటు సైఫ్ అలీ ఖాన్, నీలమ్, సోనాలీ బింద్రే, టబు కూడా నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ తో పాటు ఆరోజు సంఘటనలో టబు, సోనాలీ కూడా దోషులేనని, వారే సల్మాన్ ను తుపాకీతో కాల్చమని ప్రోత్సహించారని ప్రత్యక్ష సాక్షి పూనమ్ బిష్ణోయ్ తెలిపారు. అయితే జీపులో ఉన్నది వారేనా? అన్నది మాత్రం కచ్చితంగా చెప్పలేకపోయారు. దీంతో సైఫ్ అలీ ఖాన్, నీలమ్, టబు, సొనాలీ బింద్రేలను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది.