భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న సోనాలీ బింద్రే..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఘన విజయం అందించిన ‘ఇంద్ర’ సినిమాలో ‘దాయి..దాయి దామా..’ పాటలో చిరు తో కలిసి స్టెప్పులు వేసిన అందాల ముద్దుగుమ్మ సోనాలీ బింద్రే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో పలువురు అగ్ర హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో తన హావా కొనసాగించింది. తెలుగులో ‘ప్రేమికుల రోజు’, ‘మురారి’, ‘ఇంద్ర’, ‘ఖడ్గం’, ‘మన్మథుడు’, ‘పలనాటి బ్రహ్మనాయుడు’, ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు హిందీలో పలు టీవీ షోలలోనూ నటించారు. బాలీవుడ్ నటిగా మంచి గుర్తింపు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నది. న్యూయార్క్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోషల్ మీడియాలో తన జబ్బు గురించి ఈ విధంగా పేర్కొన్నది.

‘కొన్ని సార్లు జీవితం నుంచి తక్కువగా ఆశిస్తుంటాం. జీవితం మలుపులతో కూడిన పరీక్షలాంటిది. నాకు ఇటీవల క్యాన్సర్‌ సోకింది. నిజానికి దీన్ని మేం ఏ మాత్రం ఊహించలేదు. అస్వస్థతగా అనిపిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నా. అప్పుడు క్యాన్సర్‌ ఉందని బయటపడింది. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నన్ను కలవడానికి వచ్చి పోతున్నారు. అత్యుత్తమ ఆదరణను నాకు అందిస్తున్నారు. ఇలాంటి వారు నా చుట్టూ ఉండటం నా అదృష్టం’.‘వ్యాధిని గుర్తించారు కాబట్టి వెంటనే చికిత్స తీసుకోవడమే సరైన మార్గం. నా వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నాను. ఇప్పుడు మేమంతా సానుకూలంగా ఆలోచించి, ఈ మార్గంలో అడుగడుగూ పోరాడాలి. గత కొన్ని రోజులుగా నా వాళ్లు నాపై కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే గొప్పగా అనిపిస్తోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులే నా బలంగా పోరాడుతాను’ అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. #సోనాలి బింద్రే జబ్బు పడిన విషయం తెలుసుకున్న అభిమానులు, పలువురు ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *