మహేష్ కూతురి బర్త్‌డేలో స్పెషల్ కేక్.. నెట్టింట్లో వైరల్

సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార బర్త్ డే తాజాగా జరిగింది. ఈ బర్త్‌డే సందర్భంగా సమ్ థింగ్ స్పెషల్ కేక్‌ను డిజైన్ చేయించారు మహేష్. ఇది నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. సితార బర్త్ డేకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్, నమ్రత, గౌతమ్ కలిసి సితార బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. ఈ బర్త్ డేలో స్పెషల్ అట్రాక్షన్ కేక్.

ఈ కేక్‌పై మహేష్ తన ఫ్యామిలీ పిక్‌ను డిజైన్ చేయించారు. ఈ పిక్‌ను చూసి అభిమానులు సంబరపడుతున్నారు. మహేష్ ప్రస్తుతం తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాలో రైతు సమస్యలపై పోరాడే వ్యక్తిగా మహేష్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో విలేజ్ సెట్ సిద్ధమవుతోందని సమాచారం.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *