షాకింగ్ పవన్ పై హత్య ప్లాన్?

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారిపై నిజంగానే హత్యాప్రయత్నం జరగనుందా అంటే పరిణామాలు సానుకూలంగానే స్పందిస్తున్నాయి. ఈ మాటలు స్వయంగా పవన్ కల్యాణ్ నోటినుంచే వెలువడ్డాయి. రాష్ట్ర రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు పవన్ కల్యాణ్ జనసేనకు పురుడుపోశారు.ఈ క్రమంలో ఆయన ఏపీలో పలు అంశాలపై పోరాడి విదేశీయులను సైతం ఏపీకి రప్పించి విజయం సాధించారు. ఇక ఏపీ ప్రభుత్వంతో మిత్రపక్షంగా వ్యవహరిస్తూ సమయాన్ని చూసి ప్రశంసలు, విమర్శలు సైతం కూడగడుతున్నారు.

*అయితే ఆయన తాజాగా మాట్లాడిన మాటలు ఒకితం టెన్షన్ ని పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఏపీ డీజీపీ మాలకొండయ్యకు లేఖ సైతం రాశారు. నేడు గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీ ఎదురుగా జనసేన ఆవిర్భవ సభ జరగనుంది. ఈ మేరకు పవన్ కొన్ని విషయాలపై మాట్లాడారు. నాపై ఎటువంటి ఎటాక్ ఏమైనా జరిగితే అది ప్రజాజీవితంపై తీవ్రమైన ప్రభావం పడుతుందంటూ సెన్షేషనల్ కామెంట్లు చేశారు. గతంలో కొన్ని సందర్భాల్లో చిన్నచిన్న ఘటనలు జరిగాయని గుర్తు చేశారు.

*అంతెందుకు అనంతపురం పర్యటనలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ పై దాడి దృష్ట్యా తాను భద్రత కోరుతున్నట్టు ఏపీ డీజీపీ మాలకొండయ్యకు లేఖ పంపారు. ముఖ్యంగా తనపై ఎలాంటి దాడులైనా జరిగితే ఏపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలంటూ షాకింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు జనసేనులకు వణుకు పుట్టిస్తున్నాయి. నిజంగానే పవన్ పై ఎటాక్ జరగనుందా? ఆయన్ను హత్య చేసే ప్లానులో ఎవరున్నారు? ఇలాంటి విషయాలపై ఇప్పుడు ప్రముఖంగా చర్చ నడుస్తుంది. అటు పోలీసు అధికారులు సైతం కట్టుదిట్టం చేశారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *