సవ్యసాచి మూవీ రివ్యూ & రేటింగ్…

Savyasachi Movie Review & Rating

రివ్యూ: స‌వ్య‌సాచి
న‌టీన‌టులు: నాగ‌చైత‌న్య‌, నిధి అగ‌ర్వాల్, ఆర్.మాధ‌వ‌న్, భూమిక, వెన్నెల కిషోర్, స‌త్య, రావు ర‌మేష్, తాగుబోతు ర‌మేష్ త‌దిత‌రులు.
స‌ంగీతం: ఎం.ఎం.కీర‌వాణి
కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
ఛాయాగ్ర‌హ‌ణం: యువ‌రాజ్‌
క‌ళ‌: రామ‌కృష్ణ‌
పోరాటాలు: రామ్‌ల‌క్ష్మ‌ణ్‌
నిర్మాత‌లు: న‌వీన్ యేర్నేని, ర‌విశంక‌ర్.వై, మోహ‌న్ చెరుకూరి(సివిఎం)
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: చ‌ందూ మొండేటి.
సంస్థ: మైత్రి మూవీ మేకర్స్
విడుదల: 2 నవంబర్ 2018

Savyasachi
Savyasachi

ప్రేమ‌క‌థ‌ల్లో చ‌క్క‌గా ఒదిగిపోతుంటారు నాగ‌చైత‌న్య. ఆయ‌న‌కి విజ‌యాలు ప్రేమ‌క‌థ‌ల రూపంలోనే వ‌చ్చాయి. కానీ కొత్త‌ద‌నం కోసం వీలు కుదిరిన‌ప్పుడల్లా త‌న శైలికి భిన్నమైన యాక్ష‌న్ క‌థ‌ల్ని చేస్తుంటారు. ఈసారి చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న మార్క్ క‌థాంశంతో ‘సవ్య‌సాచి’ చేశారు. ‘కార్తికేయ‌’తో మంచి క‌థ‌కుడిగా గుర్తింపు పొందిన చందు మొండేటి ‘ప్రేమ‌మ్’ త‌ర్వాత… మ‌ళ్లీ త‌న‌కి ఇష్ట‌మైన క‌థతో ‘స‌వ్య‌సాచి’ చేశాడు. గర్భంలోనే ఇద్దరు కవలలు ఒకరిగా కలిసిపోతే ఏమవుతుందనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్ర‌మిది. మాధ‌వ‌న్ ఇందులో కీల‌క పాత్ర పోషించ‌డంతో సినిమాపై ఆస‌క్తి, అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఈ కాన్సెప్ట్‌, కాంబినేషన్‌ రేకెత్తించిన ఆస‌క్తి సినిమాలోనూ క‌నిపించిందా? ‘స‌వ్య‌సాచి’గా నాగ‌చైత‌న్య ఎలా ఉన్నాడు? ఆయ‌న‌కి ఈ చిత్రంతో ఎలాంటి ఇమేజ్ ల‌భించింది? త‌దిత‌ర విష‌యాలు తెలుసుకుందాం పదండి…

క‌థేంటంటే: విక్ర‌మ్ ఆదిత్య (నాగ‌చైత‌న్య‌) వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు తీసే ఓ ద‌ర్శ‌కుడు. ఆరేళ్ల కింద‌ట కాలేజీలో చిత్ర (నిధి అగర్వాల్‌)ని చూసి ప్రేమిస్తాడు. ఒక‌రికొకరు ద‌గ్గ‌ర‌య్యే క్ర‌మంలోనే దూర‌మ‌వుతారు. ఆరేళ్ల త‌ర్వాత అనుకోకుండా మ‌ళ్లీ క‌లుసుకుంటారు. విక్ర‌మ్ ఆదిత్య వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌తో పుట్టిన వ్య‌క్తి. అత‌నిలో మ‌రో మ‌నిషి కూడా ఉంటాడు. భావోద్వేగానికి గురైనా, ఎక్కువ సంతోషం క‌లిగినా ఎడ‌మ చేతి వైపున ఉంటూ స్పందిస్తుంటాడు ఆ రెండో మ‌నిషి. ఒక‌రిలో ఇద్ద‌రున్నారు కాబ‌ట్టే త‌ల్లి ఒకరి పేరు విక్ర‌మ్‌గా, మ‌రొక‌రి పేరు ఆదిత్య‌గా పిలుస్తుంటుంది. ప్రేయ‌సికి మ‌ళ్లీ ద‌గ్గ‌రై ఆనందంగా గ‌డుపుతున్న స‌మ‌యంలోనే విక్ర‌మ్ ఆదిత్య అక్క శ్రీదేవి (భూమిక‌) ఇంట్లో బాంబు పేలుతుంది. బావ చ‌నిపోగా, త‌న‌కి ఎంతో ఇష్ట‌మైన అక్క కూతురు మ‌హాల‌క్ష్మి కిడ్నాప్‌కి గుర‌వుతుంది. ఇంత‌కీ ఆ బాంబు పేలుడు వెన‌క ఎవ‌రున్నారు? కిడ్నాప్‌కి గురైన అక్క కూతురు మహాల‌క్ష్మిని విక్ర‌మ్ ఆదిత్య ఎలా ర‌క్షించాడు? ఎడ‌మ చేతిలో ఉన్న ఆదిత్య ఎలా సాయం చేశాడు? ఈ క‌థ‌లో అరుణ్ (మాధ‌వ‌న్ ) ఎవ‌రు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


After making a temple backdrop thriller with Karthikeya and a romantic tale with Premam, director Chandoo Mondeti is back with another thriller, this time dealing with the concept of Vanishing twin syndrome. The movie takes its time to set up the premise, establishing the character of Chay and the syndrome, and gains momentum with the arrival of Maddy, Thought the first half moves on a leisurely pace, towards the interval the movie gains pace and gets gripping. Its a perfect reentry for Maddy in Tollywood as he oozes menace and venom on screen, and his backstory is convincingly presented as a reason for his deadly nature, and Chandoo has perfectly made use of Chay’s syndrome to extract a massy performance from him and has weaved an interesting screenplay in the second half with cat and mouse chases. Editing could have been better chopping some scenes in the first half and the song placements, but nevertheless, Chandoo Mondeti has delivered a fairly engaging flick thanks to the massy performance of Madhavan, and Chay is sure to get a temporary respite with Savyasachi. All said, Savyasachi is a decent action-packed thriller but still fails due to weak narration.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *