‘ఎన్టీఆర్’ బయోపిక్ లో గుండమ్మ కథ…

టీడీపీ వవ్యస్థాపకుడు, నటసార్వభౌమ సర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రని పోషించడమే గాక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఎన్టీఆర్ జీవితంలోని పలు కీలక ఘట్టాలు ఈ చిత్రంలో చూపించనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి రోజుకో అప్‌డేట్ రిలీజ్ చేస్తూ ఈ చిత్రంపై అంచనాలను పెంచుతుంది చిత్రయూనిట్.. దీపావళి పండుగ కానుకగా తాజాగా ‘గుండమ్మ కథ’ చిత్రంలోని ‘‘లేచింది.. నిద్ర లేచింది మహిళాలోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం..’’ పాట స్టిల్ విడుదల చేశారు. ఈ స్టిల్‌లో బాలయ్యబాబు పిండి రుబ్బుతుండగా.. నిత్యామీనన్ అదే పనిగా చూస్తూ కనిపిస్తోంది. చిత్రంలో నిత్యామీనన్ సావిత్రి పాత్ర పోషిస్తోంది. ఈ స్టిల్ ద్వారా మొదటిసారి సావిత్రి రూపంలో నిత్యను చూసిన ప్రేక్షకులు.. ఈమె సావిత్రి పాత్రకు పర్‌ఫెక్ట్‌గా సూట్ అయిందని చెప్పుకుంటున్నారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్, చంద్రబాబు నాయుడుగా రానా, అక్కినేని నాగేశ్వర్ రావుగా సుమంత్, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు. జనవరి 9న ‘కథానాయకుడు’ రూపంలో ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం, జనవరి 24న ‘మహానాయకుడు’ రూపంలో రెండవ భాగం విడుదల చేయనున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *