
బాక్సాఫీసు వద్ద సూపర్‌స్టార్ మహేష్‌బాబు సత్తా ఏమిటో మరోసారి నిరూపించిన సినిమా `భరత్ అనే నేను..`. గతంలో పోకిరి, ఆ తరువాత శ్రీమంతుడు, ఇప్పుడు భరత్..` ఇలా ఇండస్ట్రీ రికార్డులను తనకు తానే బద్దలు చేస్తున్నాడు మహేష్‌బాబు. ఈ విషయంలో తనకు సాటి, పోటీ మరొకరు లేరని నిరూపించుకున్నాడు.
200 కోట్ల రూపాయల క్లబ్లో ఎప్పుడో చేరిపోయిన `భరత్..` మూవీ తాజాగా మరో రికార్డును నెలకొల్పింది. అదే శాటిలైట్ హక్కులు. ఈ సినిమా శాటిలైట్ హక్కులు 22 కోట్లకు అమ్ముడుపోయింది. తెలుగు సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ప్రసారాలు కలిగివున్న టాప్ టీవీ ఛానల్ యాజమాన్యం భరత్ అనే నేను సినిమా హక్కులను 22 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.
నాన్ బాహుబలి కేటగిరీలో ఇదో రికార్డు. ఇప్పటిదాకా ఇంత పెద్ద మొత్తంలో శాటిలైట్ బిజినెస్ చేసిన మరో మూవీ ఇంకొకటి లేదు. మహేష్‌బాబు-కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ మూవీలో ముఖ్యమంత్రి పాత్రలో మహేష్‌బాబు చెలరేగిపోయారు. ఆకాశమే హద్దుగా నటించారు. ఈ సినిమా రేపిన ప్రకంపనలు ఇప్పటికీ తగ్గలేదు. చాలా కేంద్రాల్లో రికార్డు కలెక్షన్లను తిరగరాస్తోందీ మూవీ.