సమంత ఛాలెంజ్‌.. స్వీకరించిన ఉపాసన

హైదరాబాద్‌: తన స్నేహితురాలు, రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసనకు సమంత ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ విసిరిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ పేరుతో కొత్త విధానానికి సోషల్‌మీడియా వేదికగా శ్రీకారం చుట్టారు. ఫిట్‌నెస్‌ వీడియోలను పోస్ట్‌ చేయాలంటూ పలువురు ప్రముఖులకు సవాలు విసిరారు. వారు తమ జిమ్‌ వీడియోలను పంచుకుంటూ.. మరికొందరిని ఈ ఛాలెంజ్‌లోకి ఆహ్వానిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నాగచైతన్య సవాలు స్వీకరించిన సమంత తన కసరత్తుల వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఉపాసన ఫిట్‌నెస్‌ వీడియోను షేర్‌ చేయాలని కోరారు. దీన్ని ఉపాసన తాజాగా స్వీకరించారు. విహారయాత్రలో ఉన్నప్పటికీ సవాలు స్వీకరించానని చెప్పారు. ‘సమంత విహారయాత్రలో ఉన్నప్పటికీ నీ ఛాలెంజ్‌ స్వీకరించా(నవ్వుతూ). నమ్రత, తరుణ్‌ తహిలియానీ, కనికా కపూర్‌, పింకీ రెడ్డి, అపోలో లైఫ్‌ స్టూడియోలోని ట్రైనర్లకు సవాలు విసురుతున్నా’ అని ఉపాసన పోస్ట్‌ చేశారు.

చరణ్‌ కూడా తారక్‌ ఛాలెంజ్‌ను స్వీకరించి, మంగళవారం సాయంత్రం ఫిట్‌నెస్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి, కేటీఆర్‌ తదితరులకు సవాలు విసిరారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *