అది నిజమైన ముద్దు కాదని తెలిపింది

రామ్ చరణ్, సమంతల కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ మూవీ సూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాలో చరణ్, సమంతల మధ్య ఓ చుంబన దృశ్యం ఉంది. ఈ ముద్దు సీన్ పై తాజాగా ఓ మీడియా సంస్థతో సమంత స్పందిస్తూ, వాస్తవానికి అది నిజమైన ముద్దు కాదని తెలిపింది. చరణ్ బుగ్గపై తాను ముద్దు పెట్టానని… దాన్ని ఒక కెమెరా ట్రిక్కుతో లిప్ లాక్ లా భ్రమించేలా తీశారని చెప్పింది. కథకి ఆ సన్నివేశం అవసరం కాబట్టే అలా చిత్రీకరించాల్సి వచ్చిందని తెలిపింది.

ఇటీవలే తాను, చైతూ అమెరికా వెళ్లొచ్చామని… ‘రంగస్థలం’ విడుదలకు ముందు ఉండే ఒత్తిడిని దూరం చేసుకోవడానికి వెళ్లామని సమంత చెప్పింది. ఇకపై ఆదివారాలు షూటింగ్ లకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని… అక్కినేని ఫ్యామిలీలో ఆదివారాలు ఎవరూ షూటింగ్ లకు వెళ్లరని… తాను కూడా అంతేనని తెలిపింది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *