
తాజాగా యంగ్ టైగర్, మెగాపవర్ స్టార్ లు కలిసి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించనున్న మల్టీస్టారర్ కథాంశం నవ్యపంతాలో ఉంటుందని తెలుస్తోంది.1980 ఒలింపిక్ బ్యాక్‌డ్రాప్ కథాంశమిది. గుణ్ణం గంగరాజు కథను అందించారు. ఈ చిత్రంలో చరణ్ హార్స్ రైడర్‌గా నటిస్తుంటే, ఎన్టీఆర్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు. పైగా ఆ ఇద్దరూ అన్నదమ్ములుగా కనిపిస్తారని కథ లీకైంది. క్రీడల నేపథ్యం కాబట్టి అందుకు అవసరమైన లుక్ కోసం ఆ ఇద్దరూ శ్రమిస్తున్నారు. ఎన్టీఆర్ బాక్సర్ రోల్ కోసమే ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నారట. వాస్తవానికి ఇదంతా త్రివిక్రమ్ కోసం అని ప్రచారమైనా.. తారక్ టార్గెట్ జక్కన్న అని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్ ఇద్దరినీ ఇంటర్నేషనల్ కోచ్ ట్రైనప్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా బహుభాషా చిత్రంగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రీప్రొడక్షన్ సాగుతోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారని తెలుస్తోంది.