ఎన్టీఆర్, చరణ్ #RRR ఫ్లాష్ బ్యాక్ అదేనట

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి చేయబోతున్న మల్టీస్టారర్ పీరియాడికల్ సినిమా కాదనే వార్తలు బయటికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు నిజంకాదని తెలుస్తోంది. 1920 నాటి బ్యాక్ డ్రాప్ ఈ సినిమాలో ఉంటుందట. దీని కోసం భారీ సెట్ ని వేస్తున్నారు.

హైదరాబాద్ లోని గండిపేటలో ఓ భారీ సెట్ ఈ సినిమా కోసం రూపుదిద్దుకుంటోంది. ఈ సెట్ బ్రిటిష్ కాలంనాటి పల్లెటూర్లు, ఇండియన్ టౌస్ స్కేప్ ను తలపించే విధంగా ఉంటుందట. అలాగే బ్రిటిష్ కాలంలో దొంగ, పోలీస్ నేపధ్యం ఉన్న ఇద్దరు అన్నదమ్ముల కథ ఈ సినిమా ప్లాష్ బ్యాక్ స్టోరీ లైన్ అని తెలుస్తోంది. ఎన్టీఆర్ దొంగగా, రాంచరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని కూడా సమాచారమ్.

మొత్తం మీద పీరియాడికల్ టచ్ రాజమౌళి #RRR సినిమాకి ఉంది. ఇది చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారీ సెట్స్, గ్రాఫిక్స్ ఉంటాయి. సో… ఇద్దరు స్టార్ హీరోలతో మరో విజువల్ వండర్ కి రాజమౌళి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు.

#RRR: The film to have power-packed action sequence

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *