#RRR లో ఎన్టీఆర్ కి జోడిగా హాలీవుడ్ హీరోయిన్

Hollywood heroine in Jr NTR and Ram Charan #RRR || Rajamouli ||

Hollywood heroine in Jr NTR and Ram Charan #RRR Rajamouli

ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా ముల్టీస్టారర్ మూవీ లు తెరకెక్కుతున్న రాజమౌళి ముల్టీస్టారర్ మూవీ గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది.ఎన్టీఆర్ ,రామ్ చరణ్ కాంభినేషన్ లో భారీ తారాగణం తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించడమే కారణం.సుమారు 300 కోట్ల బడ్జెట్ తో డి.వి.వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇది ఇలా ఉంటె ఈ సినిమాకి సంబంధించి సెట్స్ వర్క్ ఇప్పటికే రాజమౌళి మొదలుపెట్టేసారు.భారీ యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి హాలీవుడ్ స్టన్ట్ కొరియోగ్రాఫర్ పనిచేయడం విశేషం.బాహుబలి మించిన సినిమాగా దీనిని రూపొందించాలి అని రాజమౌళి ఆలోచనతో ఉన్నారు.

ఇది ఇలా ఉంటె ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ని జక్కన్న ఫైనల్ చేసారని అన్న వార్తలు వినపడుతున్నాయి.అందులో మరింత ఆసక్తి పెంచేవిధంగా కథానుసారం ఓ హాలీవుడ్ హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉంటుంది అని అయితే ఆమె ఎపిసోడ్ సినిమాలో ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ లో పది నిమిషాలు మాత్రమే ఉంటుంది అని టాక్ వినిపిస్తుంది.ఇంటర్వెల్ సీన్ లో హాలీవుడ్ హీరోయిన్ తో రామ్ చరణ్ ,ఎన్టీఆర్ లు నటించనున్నారు అని తెలుస్తుంది.కేవలం ఇంటర్వెల్ కి ముందే వచ్చే ఈ సీన్ ను 45 రోజులపాటు షూటింగ్ చేసేందుకు జక్కన్న పాలన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

7 నుండి 10 నిమిషాల ఈ సీన్ ను 45 రోజుల పాటు చిత్రీకరించబోతున్న జక్కన్న సినిమా మొత్తాన్ని ఏ రేంజ్ లో చిత్రీకరించబోతున్నారో అర్ధం చేసుకోవచ్చు.సినిమాకి చాలా కీలకమైన ఈ ఇంటర్వెల్ సీన్ ను అద్భుతంగా చిత్రీకరించేందుకు రాజమౌళి ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అట.ఇది ఒక పీరియాడిక్ చిత్రం అంటూ టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది.ఆ విషయం పై ఈ సినిమా ఫస్ట్ లుక్ వస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.మరి జక్కన్న ఈ సినిమాతో అటు నందమూరి ఫాన్స్ ని ,అలాగే మెగా ఫాన్స్ ని ఎంతమేరకు మెప్పిస్తారో తెలియాలంటే 2020 వరకు వేచి చూడాల్సిందే..

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *