ప్రారంభోత్సవానికి అతిథి ఎవరో తెలుసా

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్‌ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించనున్నారు. ఈ చిత్రానికి ‘RRR’ పేరును వర్కింగ్‌ టైటిల్‌గా పెట్టారు. కాగా..

Image result for rrr movie

నవంబర్‌ 11న ఉదయం 11 గంటలకు ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఇటీవల రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజున మరో సర్‌ప్రైజ్‌ కూడా ఉంది. అదేంటంటే.. సినిమా ప్రారంభ కార్యక్రమానికి యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ అతిథిగా రాబోతున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

Related image

1920 నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. ఇందులో తారక్‌, రామ్‌చరణ్‌ బాక్సర్లుగా కన్పించనున్నారట. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రానికి కథ రాశారు.

Image result for rrr movie

ఇందులో తారక్‌, రామ్‌చరణ్‌కు జోడీగా ఎవరు నటించనున్నారన్నది తెలియాల్సి ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

DVV Danayya has announced that SS Rajamouli’s RRR movie starring Jr NTR and Ram Charan would be launched on November 11, while the shooting of director Boyapati Srinivas’ RC 12 was completed on Saturday.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *