రెండో పెళ్లి చేసుకుంటే గొడవలు అవుతాయ్‌

నటి, దర్శకురాలు రేణూ దేశాయ్‌ తనకు ఓ తోడు దొరికిందంటూ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపి, ఓ వ్యక్తి చేయి పట్టుకున్న ఫొటోను షేర్‌ చేశారు. తాజాగా ఆమెకు నిశ్చితార్థం అయినట్లు, ఉంగరాలు మార్చుకుంటున్న ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ ఫొటో వైరల్‌ అయింది. కాబోయే భర్త ఎవరన్న విషయాన్ని రేణూ దేశాయ్‌ సీక్రెట్‌గా ఉంచారు. రేణూ రెండో పెళ్లికి కొందరు నెటిజన్లు మద్దతు పలుకుతుంటే, మరి కొందరు ‘చేసుకోవద్ద’ని సందేశాలు పంపుతున్నారు. వారిలో ఓ అభిమాని స్పందిస్తూ.. ‘మేడమ్‌ మీరు రెండో పెళ్లి చేసుకుంటే మీకూ, బయటివారికీ తేడా ఏముంటుంది చెప్పండి? పవన్‌ కల్యాణ్‌ మీలాంటి అందమైన శ్రీమతిని ఎందుకు వదులుకున్నారో నాకు అర్థంకావడంలేదు’ అని పేర్కొన్నారు.

‘‘రేణూ మీరు రెండో పెళ్లి చేసుకుంటే గొడవలు అవుతాయ్‌. నా దేవుడికి (పవన్‌ కల్యాణ్‌) ఎలాంటి సమస్యలు రాకూడదు. కాబట్టి ఏం చేసినా ఆలోచించి చేయండి’’ అని మరో అభిమాని మెసేజ్‌ చేశాడు. సోషల్‌ మీడియాలో మెసేజ్‌ల తాకిడికి రేణూదేశాయ్‌ స్పందిస్తూ ‘‘నాకు అమ్మాయిల కన్నా అబ్బాయిల నుంచే ఎక్కువగా మద్దతు వస్తోందని తెలుసుకుని చాలా సంతోషించా. నాకు మద్దతు తెలుపుతున్న అబ్బాయిల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలపాలనుంది. చక్కగా పెంచారు వాళ్లని. ఈ తరం అబ్బాయిల్లో మహిళలకు సమానత్వం ఇవ్వాలన్న విషయంలో క్లారిటీ ఉంది. మీ అందరి మెేసజ్‌లకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *