త్వరలోనే రేణు దేశాయ్ పెళ్లి?

ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతుంద‌ని సమాచారం.ప‌వ‌న్‌తో విడిపోయిన త‌రువాత పుణేలో పిల్ల‌ల‌తో ఒంట‌రిగా ఉంటుంది రేణుదేశాయ్.నాకు మ‌ళ్లీ పెళ్లి చేసుకొవల‌ని ఉంద‌ని ఓ ఇంట‌ర్య్వూలో చెప్పుకొచ్చింది రేణుదేశాయ్ .దీంతో ప‌వ‌న్ అభిమానులు ఆమెపై వివాస్ప‌ద కామెంట్స్ చేశారు. రేణు దేశాయ్ వేరే పెళ్లి చేసుకోవడానికి వీల్లేద‌ని ఆమెను సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీనిపై ఆమె కూడా ఘాటుగానే స్పందించింది.అయితే కొన్ని రోజులుగా రేణు, సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్న విధానం చూస్తుంటే ,ఆమె మ‌రో పెళ్లికి సిద్దం అయిన‌ట్లు తెలుస్తుంది.

Image result for renu-desai-getting-married-again

ఇటీవల ఓ వ్యక్తి చెయ్యి పట్టుకుని ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ, “నీతో ఉంటే సంతోషంగా, శాంతంగా ఉంటుంది. నా చెయ్యి ఎప్పటికీ విడువకు. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు” అని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టిన , తాజాగా తన వివాహం అతనితోనేనని చెప్పకనే చెప్పింది.

Image result for renu-desai-getting-married-again

ఆమె, తన కాబోయే భర్త చేస్తున్న మెసేజ్ లను తన స్నేహితులు చూడనివ్వడం లేదని ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది. తన కాబోయే భర్త ఇచ్చే మెసేజ్ లను చదివే ప్రైవసీ కూడా తనకు కలగట్లేదని కామెంట్ చేసింది. రేణు పుణేకు చెందిన పెద్ద బిజినెస్ మ్యాన్‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.మ‌రి దీనిపై ప‌వ‌న్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *