
షియోమీ రెడ్మీ 5 ప్రొ బాగా విజయవంతం కావడంతో షియోమీ కంపెనీ రెడ్ మీ 6 ప్రో స్మార్ట్ ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఇది నాచ్ తో కూడిన ఫుల్ స్క్రీన్ వ్యూతో ఉంటుంది. అందరూ కోరుకుంటున్న విధంగా 4000ఎంఏహెచ్ బ్యాటరీ, వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లతో ఇది వచ్చింది.
5.84 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్(1080X2280పిక్సెల్స్), 19:9 యాస్పెక్ట్ రేషియో స్క్రీన్, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 625 ఎస్ వోసీ ప్రాసెసర్, వెనుక 12 మెగాపిక్సల్+5 మెగాపిక్సల్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌తో పాటు ఆండ్రాయిడ్ ఎంఐయూఐ9 వెర్షన్ వస్తుంది..