కళ్యాణ్ రామ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ అందుకే రాలేడంట!

నందమూరి హీరో కల్యాణ్ రామ్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘నా నువ్వే’. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు షేరేత్ సంగీతం సమకూర్చారు. నిన్న విడుదలైన ఈ చిత్ర పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ చిత్రాన్ని మే 25న విడుదల చేయనున్నారు చిత్ర నిర్మాతలు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిరణ్ ముప్పవరపు,

reason behind kalyan ram ntr not attending naa nuvve event!విజయ్ వట్టికూటి నిర్మిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం వహిస్తున్నారు.నిన్న జరిగిన నా నువ్వే సినిమా ఆడియో వేడుకకు ఎన్టీఆర్ వస్తాడని అనుకున్నారు అంతా, కాని ఎన్టీఆర్ రాలేదు. దీంతో మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ ముందుగా ఈ ఫంక్షన్ కు వద్దమనే అనుకున్నాడట. కానీ అదే టైంకి హరికృష్ణ ఫ్యామిలీకి దగ్గరి బంధువైన విశాఖ దేవీసీఫుడ్స్ సంస్థ అధినేత ఇంట్లో పెళ్లి ఉండడంతో హాజరు అయ్యాడు ఎన్టీఆర్. హరిక్రిష్ణ కు వీలు పడకపోవడంతో ఎన్టీఆర్ ని పంపించాడు. అందుచేత ఎన్టీఆర్ ఈ ఫంక్షన్ కు రాలేకపోయాడని సమాచారం.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *