నిజమైన హీరో,తన సొంత డబ్బుతో అభిమానికి స్వయంగా ఇల్లు కట్టించాడు ఎవరో తెలుసా

నిజమైన హీరో,తన సొంత డబ్బుతో అభిమానికి స్వయంగా ఇల్లు కట్టించాడు ఎవరో తెలుసా
రాఘవ లారెన్స్ (జననం: అక్టోబరు 29, 1976)[1] ఒక ప్రముఖ నృత్య దర్శకుడు, సినీ నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు. 1993 లో నృత్యదర్శకుడిగా సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. తరువాత నటుడిగా అవకాశాలు వెతుక్కున్నాడు. 1998 లో మొదటి సారిగా ఓ తెలుగు సినిమాలో నటించాడు. 2001 లో లారెన్స్ ను తన పేరులో చేర్చుకుని తమిళంలో ప్రముఖ నటులతో కలిసి పనిచేశాడు. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ హీరోగా నిరూపించుకున్నారు లారెన్స్.

ట్రస్ట్ ద్వారా పేదలకు గుండె ఆపరేషన్స్ చేయిస్తున్నారు. గత ఏడాది తల్లికి గుడి కట్టించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు. ఇప్పుడు మరో అరుదైన సాయం చేసి.. రియల్ హీరో అంటే లారెన్స్ అని నిరూపించుకున్నారు. తన పిలుపునకు స్పందించిన ఉద్యమంలో పాల్గొని.. చనిపోయిన అభిమాని కుటుంబానికి ఇల్లు కట్టించాడు.గత ఏడాది తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం జరిగింది. ఇందులో రాఘవ లారెన్స్ మద్దతు ఇవ్వటంతోపాటు.. స్వయంగా పాల్గొన్నాడు.

లక్షల మంది యువకులు రోడ్లపైకి వచ్చారు. ఈ జల్లికట్టు ఆందోళనలో యోగేశ్వర్ అనే యువకుడు చనిపోయాడు. అతను లారెన్స్ వీరాభిమాని. విషయం తెలిసిన వెంటనే.. ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అప్పట్లో యోగేశ్వర్ కోరిక ఏంటీ అని ఆ తల్లిదండ్రులను అడిగాడు లారెన్స్. సార్.. మా అబ్బాయికి సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంది.. అందులో మమ్మల్ని జీవితాంతం చూసుకోవాలనే తపన పడేవాడు అని చెప్పారు ఆ కుటుంబ సభ్యులు. నా అభిమాని కోరిక తీర్చటం నా ధర్మం అన్నారు.

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే యోగేశ్వర్ కుటుంబానికి ఇల్లు కట్టించాడు. ఇటీవలే అది పూర్తయ్యింది. ఫిబ్రవరి 7వ తేదీ బుధవారం ఆ ఇంట్లోకి యోగేశ్వర్ కుటుంబం గృహ ప్రవేశం చేసింది. ఈ విషయాలను స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు రాఘవ లారెన్స్. ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షల వరకు ఖర్చు అయ్యిందని అభిమానులు చెబుతున్నారు. ఒక్క పైసా కూడా యోగేశ్వర్ కుటుంబం ఖర్చు పెట్టుకుండా.. మొత్తం లారెన్స్ ఖర్చు చేశారు. నిజంగా రియల్ హీరో కదా.. దయచేసి అందరికీ షేర్ చేయండి ..

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *